ఘనంగా ధ్యానమందిర సత్సంగ కార్యక్రమం
17-08-2026 12:00 AM
బేల, ఆగస్టు 16 : మండలంలోని భాది గ్రామంలో ఆధ్యాత్మిక గురువు పులాజీబాబా ధ్యానమందిర వార్షికోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూలాజీ బాబా ప్రధాన శిష్యబృందం ఆధ్యాత్మిక గురువుల చిత్రపటాలకు, ఆధ్యాత్మిక గ్రంథాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు సత్సంగ కార్యక్రమంలో పాల్గొని ఆధ్యాత్మిక సందేశాలను ఆలకించారు. ఈ కార్యక్రమానికి భక్తులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో హాజరై భక్తిశ్రద్ధలతో కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.






