17 August, 2026 | 1:46 AM

జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరు పెట్టాలి

17-08-2026 12:00 AM

నిర్మల్, ఆగస్టు 16 (విజయ క్రాంతి) : నిజాం నిరంకుశ పాలనపై ఉద్యమం చేస్తూ దానికి వ్యతిరేకంగా పోరాడినా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వారోత్సవాలను రాష్ట్రంలో ఘనంగా నిర్వహిస్తున్నట్టు తెలంగాణ గౌడ జనార్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు అమరవే నీ నర్సా గౌడ్ తెలిపారు . ఆదివారం జయంతి ఉత్సవాల నిర్వహణ పై జిల్లా కేంద్రంలో సమావేశం నిర్వహించారు.ఆగస్టు 18 నుంచి 25వ తేదీ వరకు గ్రామ గ్రామాన ఘనంగా నిర్వహించి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

సుమారు 350 ఏళ్ల క్రితమే రాచరిక, భూస్వామ్య పెత్తందారీ వ్యవస్థ, అధిక పన్నులు, దోపిడీ, అణిచివేతకు వ్యతిరేకంగా పాపన్న గౌడ్ పోరాడారని పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాలను ఏకం చేసి మొఘల్ పాలకుల ఆధిపత్యాన్ని సవాల్ చేసి రాజ్యాధికారాన్ని సాధించిన గొప్ప యోధుడని కొనియాడారు. ఈ నెల 18న ట్యాంక్ బండ్ పై పాపన్న గౌడ్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారని, ఆ లోపు జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరు పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని, గీత కార్మికుల ప్రమాద బీమాను రూ.10 లక్షలకు పెంచాలని కోరారు. హామీల అమలుపై ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్రవ్యాప్తంగా దశలవారీగా ఆందోళన కార్యక్రమాలు చేపడాతమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు పాల్గొన్నారు