8 April, 2026 | 4:19 PM

Breaking News

భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు   •   ఏప్రిల్ 10న రాజ్యసభ సభ్యుడిగా నితీష్ ప్రమాణస్వీకారం.. సీఎం పదవికి రాజీనామా తేదీపై అనిశ్చితి   •   ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరం: మంజీ నాయక్   •   సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన రిపబ్లిక్ ఆఫ్ ఘన హైకమిషనర్   •   నీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలి   •   ప్రజల వద్దకే మినీ బ్యాంక్ సేవలు   •   ఈనెల 21న మున్నూరు కాపు సంఘం జిల్లా కమిటీ ఎన్నిక   •   ఐకెపి ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం   •   అర్జీ-3లో సింగరేణి కార్మిక కుటుంబాలను ఇబ్బందులకు గురి చేస్తున్న అధికారులు   •   ఇరాన్‌లో భారతీయులకు అలర్ట్.. వెంటనే బయటకు రండి, కేంద్రం అత్యవసర సూచనలు!   •  

రాష్ట్రానికి అదనపు యూరియా

13-02-2026 12:00 AM

కొత్తగూడెం  ఎయిర్ పోర్టు పై కేంద్రానికి నివేదికలు ఇవ్వనున్న తెలంగాణ ప్రభుత్వం: మంత్రి తుమ్మల

అశ్వారావుపేట, ఫిబ్రవరి 12(విజయ క్రాంతి):  తెలంగాణ రాష్ట్రానికి కావలసిన అదనపు యూరియా గురించి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు  ఢిల్లీ లో సి ఎం పేషీ అధికారులతో మాట్లాడారు.దమ్మపేట మండల పరిధిలోని గండుగులపల్లి గ్రామంలో గురువారం ఉదయం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు  ఢిల్లీలో  అధికారులతో ఫోన్లో మాట్లాడి  సరఫరా అయ్యేలా చూడాలన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలో ఈ సీజన్లో వరి మరియు మొక్కజొన్న సాగు అధికంగా ఉన్న పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన యూరియాతో పాటు అదనంగా 2 లక్షల 50 మెట్రిక్ టన్నుల యూరియాను తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వవలసినదిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలని, కొత్తగూడెంలో ఎయిర్ పోర్టు నిర్మాణానికి అనుమతులు విషయంపై కేంద్ర విమాన యన శాఖామంత్రి రామ్మోహన్ నాయుడు కూడా కలిసి వినతి పత్రం అందజేయాలని,

కొత్తగూడెం జిల్లాలో అనువైన ప్రదేశం ఉన్న దృష్ట్యా ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేషీ అధికారులను మంత్రి తుమ్మల ఆదేశించారు. అంతేకాకుండా వ్యవసాయ శాఖలో ఉన్న పలు పెండింగ్ సమస్యలను కేంద్రం పరిష్కారం అయ్యే విధంగా కేంద్రప్రభుత్వంపై  ఒత్తిడి  తేవాలని అధికారులను మంత్రి తుమ్మల ఫోన్లో ఆదేశించారు.