21 August, 2026 | 11:28 PM

సంతానోత్పత్తికి చిరునామా ఫెర్టీ 9 ఫెర్టిలిటీ సెంటర్లు

14-06-2024 01:06 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 13 (విజయక్రాంతి): సంతానోత్పత్తికి చిరునామాగా ఫెర్టీ 9 ఫెర్టిలిటీ సెంటర్లు నిలుస్తున్నా యని సంస్థ ఎండీ జ్యోతి పేర్కొన్నారు. త్వరలో ఏపీలోని తిరుపతి, రాజమండ్రిలో రెండు ఫెర్టీ 9 ఫెర్టిలిటీ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. వీటికి సంబంధించిన లోగోలను గురువారం సోమాజీ గూడ ప్రెస్‌క్లబ్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఫెర్టీ 9 మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జ్యోతి మాట్లాడుతూ.. తిరుపతి, రాజమండ్రిలో తమ వైద్య సేవలను కోరుతున్న ప్రతి జంటకు సమర్థవంతమైన చికిత్స ప్రణాళికలను అందించడానికి తమ బృందం సిద్ధంగా ఉందని చెప్పారు. ఈ కొత్త కేంద్రాలు భద్రత, పారదర్శకత, కారుణ్య సంరక్షణకు ప్రాధాన్యమిస్తూ, సహాయక సంతానోత్పత్తి చికిత్స లలో అత్యుత్తమ ఫలితాలను సాధించడంలో కొనసాగుతున్న నిబద్ధతకు నిదర్శనమని పేర్కొన్నారు.