నేడు శాంసంగ్ గెలాక్సీ AI సూపర్ సేల్
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 13 (విజయక్రాంతి): దేశంలోనే కాకుండా అంతర్జా తీయంగా కూడా అత్యంత పేరు ప్రఖ్యాతలు పొందిన మొబైల్ తయారీ కంపెనీ శాంసం గ్ గెలాక్సీ AI సిరీస్ మొబైల్స్ తెలుగు రాష్ట్రాల్లోని బిగ్ సీ షోరూంలలో గురువారం నుంచి సూపర్‌సేల్ ప్రారంభం అవుతుందని ఫౌండర్ అండ్ సీఎండీ ఎం బాలు చౌదరి తెలిపారు. అత్యంత అధునాత ఈ శాంసంగ్ గెలాక్సీ ఏఐ సిరీస్ స్మార్ట్ ఫోన్లు అధ్భుత సాంకేతికతకు ప్రతి రూపాలని చెప్పారు. ఆకర్షణీయమైన రంగులు, డిజైన్లతో రూపొందించిన ఈ గెలాక్సీ AI సిరీస్ స్మార్ట్ ఫోన్లు కస్టమర్లకు అద్భుతమైన అనుభూతిని అందిస్తాయని వివరించారు. ఈ AI సిరీస్ మొబైల్స్ ప్రారంభపు ధర రూ. 39,999గా ఉందని పేర్కొన్నారు.
AI సిరీస్ ప్రత్యేక ఫీచర్లు
సర్కిల్ టు సెర్చ్, లైవ్ ట్రాన్ల్సేట్, చాట్ అసిస్ట్, నోట్ అసిస్ట్, 50 ఎంపీ అడాప్టివ్ పిక్సెల్ టెక్నాలజీతో కూడిన కెమెరా, నైటోగ్రఫీ, AI ఎడిట్ కెమెరా, గేమింగ్ స్నాప్ డ్రాగన్, 8 జెన్ 3, బిగ్గర్ వేపర్ చాంబర్, 2,600 నెట్స్ అడాప్టివ్ డిస్ల్పే వంటి అత్యంత అధునాతన ఫీచర్లు ఎన్నో ఈ గెలాక్సీ AI సిరిస్ ఫోన్లు కలిగి ఉన్నాయని బాలుచౌదరి వివరించారు. ఈ మొబైల్స్ కొనుగోలుదారులకు జీరో డౌన్ పేమెంట్, 24 ఈఎంఐ సదుపాయాలు లభిస్తాయని చెప్పారు. రూ.16 వేల వరకూ ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్, రూ.18 వేల వరకూ ఎక్చ్సేంజ్ బోనస్ వంటి ఆకర్షణీయమైన ఆఫర్లు ఉన్నాయని వివరించారు.






