26 August, 2026 | 7:37 PM

కురువని వాన.. రైతులు హైరానా..!

23-06-2026 12:59 AM

ఇప్పటికే కురిసిన వానలకు విత్తనాలు వేసిన రైతులు

తదుపరి వర్షాలు లేక మొలకెత్తని గింజలు

ఊరిస్తున్న మబ్బులు.. రాలని చినుకులు

ఆందోళనలో రైతన్నలు

అప్పులు చేసిన రైతుల్లో పెరుగుతున్న ఆందోళన

ఎల్‌నినో ప్రభావం ఉండొచ్చని నిపుణుల అభిప్రాయం

సరైన వర్షాలు లేక మొలకెత్తని గింజలు

ప్రారంభ వర్షాలతో విత్తనాలు వేశారు

తొందరపడి మళ్లీ విత్తనాలు వేయొద్దని వ్యవసాయ శాఖ సూచన

నారాయణపూర్ మండలంలో ప్రారంభ వర్షాలకు పత్తి, కందుల విత్తనాలు వేసిన రైతులు ఇప్పుడు సరైన వర్షాలు లేక తీవ్ర ఆందోళనలో ఉన్నారు. గింజలు మొలకెత్తకపోవడంతో మళ్లీ విత్తనాలు కొనాల్సి వస్తుందేమోనని రైతులు భయపడుతున్నారు.

సంస్థాన్ నారాయణపూర్, జూన్ 22: నారాయణపురం మండల వ్యాప్తంగా తగిన వర్షాలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జూన్ నెల ప్రారంభంలో కురిసిన ఒకటి రెండు వర్షాలకు రైతులు పత్తి, కందులు తదితర విత్తనాలను విత్తుకున్నారు కానీ తదనంతరం ఇప్పటివరకు సరైన వర్షం కురువకపోవడంతో అవి మొలకెత్తలేదు. దీంతో రైతులు హైరానా పడుతున్నారు. సమృద్ధిగా వర్షాలు కురిస్తే ఈపాటికి రైతులంతా తాము వేసిన గింజలు మొలకెత్తి తదనంతర వ్యవసాయ పనులతో తీరిక లేకుండా ఉండేవారు. కానీ సరైన వర్షాలు కురవక మొలకెత్తని గింజల స్థానంలో మళ్ళీ విత్తుకోవాల్సి వస్తుందేమోనని ఆందోళన చెందుతున్నారు.

నారాయణపురం మండల వ్యాప్తంగా సాగవుతున్న భూములలో అత్యధికశాతం వరి , పత్తి,కందులు నాటుకుంటారు. సుమా రు ఇరవై శాతం రైతులు మొదట కురిసిన వర్షాలకు ముందుగానే గింజలు నాటుకున్నారు.కానీ అప్పటి నుండి సరైన వర్షం కురవలేదు.చిరు జల్లులతో ఊరిస్తూ వరుణుడు రైతన్నలకు పరీక్ష పెడుతున్నట్టుగా ఉంది.భారీ వర్షా లు అంటూ వాతావరణ శాఖ ప్రకటనలు ఈ మండలానికి వ ర్తించట్లేదు.జిల్లాలో అక్కడక్కడ కురిసినప్పటికీ తమ ప్రాంతంలో సరైన వర్షం కురవకపోవడంతో అప్పులు చేసి పట్టి గింజ లు నాటుకున్న రైతులు తీవ్ర ఆందోళనతో ఉన్నారు.

మీ ప్రాంతంలో కూడా వర్షాలు కురవడం లేదా? పత్తి లేదా ఇతర పంటల విత్తనాలు మొలకెత్తాయా? రైతులకు నిపుణుల సూచనలు తెలుసుకోండి.

ఎల్ నినో ప్రభావం

భూ ఉపరితల మార్పులతో వర్షాలు కా స్త ఆలస్యంగా మొదలైతాయని వ్యవసాయ శాఖ ప్రకటించినప్పటికీ రైతులకు సరైన అవగాహన లేకపోవడంతో ఎప్పటి మాదిరిగా తమ పనులు ప్రారంభించుకున్నారు.నెల ఆలోస్యంగా వర్షాలు రాబోతుండడంతో ఇప్పటికే విత్తనాలు వేసుకున్న రైతులు అవి మొలుస్తాయో లేదోనని మళ్ళీ విత్తనాలు కొనాలంటే అయ్యే ఖర్చు గురించి ఆందోళన చెందుతున్నారు.

మండుతున్న ఎండలు

జూన్ మాసం పూర్తి కావస్తున్నా ఎండ వేడిమి ఇంకా తగ్గడం లేదు.భానుడి భగభగలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జూన్ ప్రారంభంలో కురిసిన కొద్ది పాటి వర్షాలతో వాతావరం కొద్దిగా మారినప్పటికీ ప్రస్తుతం వేసవిని తలపిస్తున్నాయి.

ఆశలు రేపుతున్న మబ్బులు

ప్రతిరోజూ ఉదయం నుండి వేసవి కాలంలా దంచికొడుతున్న ఎండలకు సా యంత్రం కాగానే కమ్ముకొస్తున్న మబ్బులు రైతులలో కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయి.ప్రతి రోజు వర్షం కోసం ఎదురుచూస్తున్న రైతన్నలకు నిరాశే మిగులుతుంది.కొద్ది పాటి జల్లులకే పరిమితమై మబ్బులు మాయమై పోతున్నాయి.

వ్యవసాయం, వాతావరణం, తెలంగాణ, జాతీయ, బిజినెస్, విద్య, క్రీడలు, సినిమా రంగాలకు సంబంధించిన తాజా వార్తల కోసం విజయక్రాంతి న్యూస్‌ను నిరంతరం సందర్శించండి.

అప్పులు తెచ్చి విత్తనాలు వేశాం

‘ఇరవై రోజుల క్రితం కురిసిన వర్షాలతో దుక్కి దున్ని విత్తనాలు నాటుకున్నాం.వర్షాలు ఎప్పటిలాగా బాగా కురుస్తాయని అప్పులు తెచ్చి మరీ విత్తనాలు నాటుకున్నాం.నాటిన గింజలు వర్షాలు లేక మొలకెత్తడం లేదు.ప్రతి రోజు వర్షం కోసం ఎదురు చూస్తున్నాం‘

ఎర్రోళ్ల నర్సింహ,రైతు

రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు

‘మొదట కురిసిన వర్షాలతో కొంత మం ది రైతులు పత్తి గింజ లు నాటుకున్నారు. తొందరపడి రైతులు విత్తనాల ను నాటుకోవద్దు. వర్షాలు కొద్దిగా ఆలస్యంగా మొదలవ్వడంతో మొలవని గిం జల స్థానంలో మళ్ళీ నాటుకోవాల్సి రా వడంతో అనవసర ఖర్చు పెరుగుతుంది .కొద్ది రోజులు వేచి చూసి గింజలను సరై న నాణ్యత చూసి కొనుగోలు చేసుకోవాలి.

పూజ,మండల వ్యవసాయాధికారి

FAQ's

Q1. రైతులు ఎందుకు ఆందోళన చెందుతున్నారు?

ప్రారంభ వర్షాలకు విత్తనాలు వేసినా తరువాత వర్షాలు లేకపోవడంతో గింజలు మొలకెత్తడం లేదు.

Q2. ఏ పంటలు ఎక్కువగా ప్రభావితమయ్యాయి?

పత్తి, కందులు మరియు ఇతర వర్షాధార పంటలు.

Q3. వ్యవసాయ శాఖ ఏమి సూచిస్తోంది?

తొందరపడి మళ్లీ విత్తనాలు వేయకుండా కొద్ది రోజులు వేచి ఉండాలని సూచిస్తోంది.

Q4. వర్షాభావానికి కారణం ఏమిటి?

ఎల్‌నినో ప్రభావం మరియు వాతావరణ మార్పులు కారణంగా వర్షాలు ఆలస్యమవుతున్నాయని అధికారులు చెబుతున్నారు.

Q5. రైతులు ఏం చేయాలి?

నాణ్యమైన విత్తనాలు కొనుగోలు చేసి, వాతావరణ పరిస్థితులను గమనిస్తూ వ్యవసాయ అధికారుల సూచనలు పాటించాలి.