02-05-2025 10:42:13 PM
భద్రాచలం,(విజయక్రాంతి): వైశాఖ శుద్ధ పంచమి జగద్గురు ఆదిశంకరాచార్య స్వామి వారి జయంతి వేడుకలు భద్రాద్రి బ్రాహ్మణ పురోహిత సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. రామానుజ జయంతి కూడా కలసి రావడంతో ఉభయ స్వామి వార్ల జయంతులను సంయుక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాయత్రీ బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు రామావజ్జల. రవికుమార్ శర్మ ప్రసంగిస్తూ ఆది శంకర, రామానుజ స్వామివారలు భారత సమాజానికి అనేక సేవలు అందించారని తెలియజేస్తూ ఉభయ స్వామి వార్లకు నమస్సుమాంజలులు అర్పించారు, ఈ కార్యక్రమంలో స్థానిక పురోహిత సంఘం ప్రధాన కార్యదర్శి పవన్ కుమార్ శర్మ, పురోహిత ప్రముఖులు ఎం.వి శ్రీనివాస్, ఇంగువ. రామకృష్ణ శాస్త్రి, కలకోట శ్రీనివాసాచార్యులు, ఆర్వి శ్రీనివాస్ శర్మ, ఎస్. రాజేశ్వర శర్మ, ఆర్. కళ్యాణ్ రామ్ శర్మ, ఆరవెల్లి. జగన్నాధా చార్యులు, శలాక. లక్ష్మీనరసింహ శర్మ తదితరులు పాల్గొన్నారు