02-05-2025 10:44:42 PM
జిల్లా అధ్యక్షులు చిట్ల సత్యనారాయణ పటేల్
బెల్లంపల్లి అర్బన్,(విజయక్రాంతి): మున్నూరు కాపులు ఐక్యంగా ఉంటేనే హక్కుల సాధన సాధ్యమవుతుందనీ మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు చిట్ల సత్యనారాయణ పటేల్ అన్నారు. శుక్రవారం కాసిపేట మండలం దేవాపూర్ లోని సల్పాలవాగు సమీపంలో మున్నూరు కాపు సంఘం మండల అధ్యక్షులు అట్టెపల్లి శ్రీనివాస్ పటేల్ అధ్యక్షతన జరిగిన మున్నూరు కాపు నూతన కమిటీ సన్మాన కార్యక్రమానికి జిల్లా ప్రధాన కార్యదర్శి మిట్ట లచ్చన్న పటేల్ తో కలిసి హాజరై మాట్లాడారు. మున్నూరు కాపులు ఐక్యంగా ఉండి హక్కులను సాధించుకోవాలన్నారు. మున్నూరు కాపు విద్యార్థులకు ప్రతి ఏడాది బుక్స్ అందించడం, పేదింటి యువతి పెళ్లికి మంగళ సూత్రాలు అందించడం జరుగుతుందన్నారు. పేదలకు సంఘం తరుపున సహాయ సహకారాలు అందించడం ఎల్లవేళ జరుగుతుందన్నారు.
ఈ సందర్భంగా కాసిపేట మండల మున్నూరు సంఘం నూతన కమిటీని శాలువాలతో ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు అట్టెపల్లి శ్రీనివాస్ పటేల్, మాజీ జడ్పీటీసీ రౌతు సత్తయ్య, జిల్లా అధికార ప్రతినిధి సిద్ధం తిరుపతి పటేల్, జిల్లా యూత్ అధ్యక్షుడు తేండ్ర శ్యామ్ పటేల్, మండల ప్రధాన కార్యదర్శి ఇంగు నారాయణ పటేల్, గౌరవాధ్యక్షులు అగ్గు శ్రీనివాస్ పటేల్, సిద్దం బాపు పటేల్, ఉపాధ్యాక్షులు మచ్చ ఆశోక్ పటేల్, మడిపల్లి తిరుపతి పటేల్, సిద్ధం రాములు పటేల్, కోశాధికారి పానగంటి రాజేందర్ పటేల్, సంయుక్త కార్యదర్శి సూరం కిషన్ పటేల్, పానగంటి తిరుపతి పటేల్, గుర్రాల వేణు పటేల్, పానగంటి అశోక్ పటేల్. పులుగం మల్లేశ్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.