02-05-2025 10:39:41 PM
మహబూబాబాద్,(విజయ క్రాంతి): మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన మృతుల కుటుంబాలకు కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీల నేతలు ఆర్థిక సహాయం అందించి అండగా నిలిచారు. దుర్గారం గ్రామానికి చెందిన జంగా నవ్య, మౌనిక రోడ్డు ప్రమాద ఘటనలో మరణించగా, మృతుల కుటుంబాలకు శుక్రవారం బీఆర్ఎస్ పక్షాన 53 వేల రూపాయలు, కాంగ్రెస్ పక్షాన 50 వేల రూపాయలను అందజేశారు.