ఘనంగా ఆదిశంకరాచార్య జయంతి వేడుకలు
21-04-2026 02:16 PM
గజ్వేల్, ఏప్రిల్21: గజ్వేల్ డివిజన్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఆధ్వర్యంలో ఆది శంకరాచార్య జయంతి వేడుకలు గజ్వేల్ రామాలయ ప్రాంగణంలో నిర్వహించారు. గణపతి పూజ, ఆది శంకరాచార్య ఉత్సవ విగ్రహానికి పంచామృత అభిషేకము, పుష్పార్చన, మంగళహారతి, మంత్రపుష్పం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ డివిజన్ బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య అధ్యక్షుడు దేశపతి శంకర్ శర్మ, కార్యదర్శి రవీందర్రావు, కోశాధికారి కృష్ణమూర్తి శర్మ, చాడ నందబాలశర్మ, ఉపాధ్యక్షుడు రాయారావు విశ్వేశ్వర్ రావు, బెజుగామ నాగేందర్రావు దేవునూరీ రాజేశ్వర్, యేగీశ్వర మురళిశర్మ, అమరవాది నీరంజన శర్మ,, ఆదిరాజుపల్లె శ్రీనివాస్ శర్మ, భక్తులు పాల్గొన్నారు.






