25 July, 2026 | 3:44 PM

అమ్మవారి ఆలయంలో కొనసాగుతున్న అఖండ భజన కార్యక్రమం

25-07-2026 03:12 PM

కార్యక్రమానికి పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

చందుర్తి,జులై 25( విజయక్రాంతి): చందుర్తి మండల కేంద్రంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవాలయంలో తొలి ఏకాదశి(Shayani Ekadashi) పండగను పురస్కరించుకొని అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, సాధు సజ్జన భజన మండలి వారి ఆధ్వర్యంలో భజన కార్యక్రమం ప్రారంభించారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు, అనంతరం ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ మాట్లాడుతూ ఆనాడు వర్షాలు లేక పాడిపంటలు పండక , ఈ ప్రాంత ప్రజలు అలమటిస్తున్న సమయంలో మహాలక్ష్మి అమ్మవారి సమక్షంలో 24 గంటల అఖండ భజన కార్యక్రమానికి నాంది పలికారు, ఆనాడు నా చేతుల మీదుగా కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది.

అప్పటి నుండి ఇప్పటివరకు తొలి ఏకాదశి రోజున మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకొని  ఈ ప్రాంత ప్రజలు ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో పాడి పంటలు సమృద్ధిగా పండాలని అమ్మవారిని వేడుకోవడం జరుగుతుందన్నారు, అలాగే అప్పటినుండి ఇప్పటివరకు  సాధు సజ్జన భజన మండలి ఆధ్వర్యంలో బజన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది, ఈ భజన కార్యక్రమానికి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కళాకారులు ఈ కార్యక్రమానికి హాజరు అవుతున్నారు. ఈ కార్యక్రమంలో రాజూరి జనార్ధన చారి, రాజూరి రాజయ్య, మర్రి లస్మయ్య, రాజురి రవీందర్, డిస్ రాజు, మల్లేశం, బాశెట్టి మౌలయ్య, మండల నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.