ఎస్‌ఐఆర్ ను వేగవంతం చేయాలి
బీఆర్‌ఎస్ శ్రేణులకు మాజీ ఎమ్మెల్యే పిలుపు
బోధన్ నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చ.
గ్రామస్థాయిలో పార్టీ బలోపేతానికి సమిష్టిగా పనిచేయాలని సూచన
బోధన్,జూలై 25 (విజయక్రాంతి): బోధన్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ సమన్వయ కమిటీ సమావేశం మాజీ ఎమ్మెల్యే షకీల్ అమీర్ సతీమణి ఆయేషా ఫాతిమా ఆధ్వర్యంలో శనివారం ఆమె నివాసంలో నిర్వహించారు. సమావేశంలో ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) నమోదు ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు పార్టీ భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా ఆయేషా ఫాతిమా మాట్లాడుతూ... ఎస్‌ఐఆర్ నమోదు కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో వేగవంతం చేయాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
అర్హులైన ప్రతి ఒక్కరి నమోదు పూర్తయ్యేలా ఇంటింటికీ వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తూనే గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని కోరారు. సమావేశంలో పార్టీ సంస్థాగత బలోపేతం, సభ్యత్వ నమోదు, ప్రజా సమస్యలపై చేపట్టాల్సిన కార్యక్రమాలు, రాబోయే రోజుల కార్యాచరణపై నాయకులు చర్చించారు. అన్ని కార్యక్రమాలను సమన్వయంతో విజయవంతం చేయాలని కార్యకర్తలకు సూచించారు. ఈ సమావేశంలో బీఆర్‌ఎస్ జిల్లా ఇన్‌చార్జి వి.జీ. గౌడ్, సార్‌నిజామాబాద్ ఇన్‌చార్జి సుమిత్ర ఆనంద్, మాజీ జడ్పీ చైర్‌పర్సన్ విట్టల్, మండల అధ్యక్షులు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, మహిళా నాయకులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






