‘ఏక రాగ’ను ఆవిష్కరించిన ఆదిత్య బిర్లా ‘ఇంద్రియ’
హైదరాబాద్ జూన్ 2026: భారతదేశ గొప్ప నృత్య, హస్తకళ, వాస్తుశిల్పం, ప్రాంతీయ సంప్రదాయాల వార సత్వం నుండి స్ఫూర్తి పొంది, ఆదిత్య బిర్లా జ్యువెలరీకి చెందిన ‘ఇంద్రియ’ సంస్థ, 'ఏక రాగ' అనే సాంస్కృతిక కళాత్మకత రూపాన్ని ఆవిష్కరించింది. నృత్యతత్వంతో ప్రేరణ పొందిన ఈ సాంస్కృతిక కళావిష్కరణ శరీరం భావవ్యక్తీకరణకు ఒక కాన్వాస్‌గా నిలుస్తుంది.
భారతదేశ విభిన్న సాంస్కృతిక గుర్తింపులను ఒకే ఏకీకృత లయ ద్వారా వేడుకగా చేసుకునేలా రూపొందించ బడిన ఈ ప్రచారం, హైదరాబాద్, పుణె, భువనేశ్వర్, దిల్లీ నగరాలలో జరుగుతుంది. ప్రతి నగరం తన నృత్య రూపం, కళాత్మక ప్రభావాలు, ఆభరణాల సంప్రదాయాలు, వధువుల అలంకరణ వ్యక్తీకరణల ద్వారా ఒక ప్రత్యేక మైన ప్రాంతీయ కథనాన్ని వివరిస్తుంది. హైదరాబాద్‌లోని శరత్ సిటీ క్యాపిటల్ మాల్‌లో, ఏక రాగ ఒక భారీ ఇన్‌స్టాలేషన్ ద్వారా కూచిపూడి నృత్యంలోని నిశ్శబ్ద కవిత్వాన్ని, భక్తి సౌందర్యాన్ని సజీవంగా ఆవిష్కరించింది.
దక్షిణ భారత దేవాలయ వాస్తుశిల్పం నుండి ప్రేరణ పొందిన ఈ ప్రదేశంలో, ఆ ప్రాంతపు కళా వారసత్వంలో పాతుకుపోయిన అలంకార తోరణాలు, సాంప్రదాయ నమూనాలు, ఆచారపరమైన అంశాలు ఉన్నాయి. దీని మధ్యలో, సాంప్రదాయ వస్త్రధారణతో, ‘ఇంద్రియ’ సున్ని తంగా రూపొందించిన దేవాలయ ఆభరణాలతో అలంకరించబడిన కూచిపూడి డిజైన్ ఉంది.
ఈ ప్రచారంపై ఇంద్రియ మార్కెటింగ్, విజువల్ మర్చండైజింగ్ విభాగాధిపతి శాంతిస్వరూప్ పాండా మాట్లాడుతూ ఏక రాగతో, సంస్కృతిని కేవలం గమనించడమే కాకుండా, లోతుగా అనుభూతి చెందే అనుభవాన్ని సృష్టించాలని తాము కోరుకున్నట్టు తెలిపారు. ఏక రాగ ద్వారా, ఆభరణాలు అలంకరణకు అతీతంగా గుర్తింపు, కళాత్మకత, వారసత్వానికి సజీవ వ్యక్తీకరణగా మారతాయనీ చెప్పుకొచ్చారు.






