11 March, 2026 | 3:14 AM

రిమ్స్‌లో ఆదివాసీ బాలింత మృతి

11-03-2026 01:28 AM

మృతురాలి పొట్టపై వింత మరకలు

ఉట్నూర్, మార్చి ౧౦ (విజయక్రాంతి): ఉట్నూర్ మండల కేంద్రంలోని రాంజీ గోండుగూడకు చెందిన ఆత్రం గంగుబాయి (25) అనే బాలింత రిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. మృతురాలి బంధువులు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అదనపు వైద్యాధికారి డాక్టర్ కూడ్మేత మనోహర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఫిబ్రవరి 28న రెండవ కాన్పు ప్రసూతి కోసం రిమ్స్‌లో చేరారు.

అదేరోజు పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం ఇంటికి వెళ్లిన బాలింత ఈనెల 9న అనారోగ్యానికి గురైంది. దీంతో కుటుంబ సభ్యులు మళ్ళీ రిమ్స్ ఆస్పపత్రికి తీసుకొచ్చారు. వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తుండగా మంగళవారం తెల్లవారు జామున మృతి చెందిందని తెలిపారు.

మృతి చెందిన ఆత్రం గంగుబాయి పొట్టపై వింత మరకలు తేలడంతో కుటుంబ సభ్యులు వైద్యుల నిర్లక్ష్యంతోనే ఆమె మరణించిందని ఆరోపిస్తున్నారు.  కాగా బాలింత మృతిపై కలెక్టర్ రాజర్శి షా, ఐటీడీఏ పి.ఓ యువరాజ్ మార్మట్ పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. కాగా పుట్టిన మగ శిశువును అన్ని రకాలుగా, ఆదుకోవాలని శిశు సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు.