15 June, 2026 | 9:27 PM

Breaking News

ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •   ఘనంగా పాఠశాల పునఃప్రారంభం   •   రామలక్ష్మి పురం ప్రాథమిక పాఠశాల బడి పునఃప్రారంభం   •   ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించే బాధ్యత ఎంఈఓలదే: జిల్లా కలెక్టర్ అంకిత్   •   ట్రాన్స్‌ఫార్మర్‌లో భారీ అగ్నిప్రమాదం   •   బల్మూర్ ఎంపీడీవోగా రేవంత్ రెడ్డి బాధ్యతల స్వీకరణ   •   అక్రమ మట్టి రవాణాపై కఠిన చర్యలు   •   కామారెడ్డి టిఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ కి సన్మానం   •   ఘనంగా ఉప ముఖ్యమంత్రి భట్టి జన్మదిన వేడుకలు   •  

రంగారెడ్డి జిల్లా టీఎన్జీవో కార్యాలయం

09-04-2026 12:33 AM

ప్రారంభించిన అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్

టీఎమ్‌ఆర్‌ఈఐఎస్ చైర్మన్ ఫహీం ఖురేషి  

పాల్గొన్న ఉద్యోగ సంఘ నేతలు

హైదరాబాద్, ఏప్రిల్ ౮(విజయక్రాంతి): తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్ యూనియన్ రంగారెడ్డి జిల్లా రినోవేటెడ్ కార్యాల యాన్ని బుధవారం ముఖ్య అతిథులు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, టీఎమ్‌ఆర్‌ఈఐఎస్ చైర్మన్ ఫహీం ఖురేషి ప్రారంభించారు.

ఈ సందర్భంగా గౌరవ అతిథి తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్ యూనియన్ కేంద్ర సంఘం అధ్యక్షుడు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి డాక్టర్. ఎస్‌ఎంహుస్సేని(ముజీబ్) ముఖ్యఅతిథులకు శాలు వా కప్పి వెంకటేశ్వరస్వామి జ్ఞాపికను అందజేశారు.

నాయకులు, అసోసియేట్ అధ్యక్షు లు కె.వెంకటేష్, సత్యనార్య గౌడ్, కోశాధికారి ఉమారెడ్డి. టీఎన్జీవోఎస్ యూనియన్ రంగారెడ్డి జిల్లా అడ్‌హక్ కమిటీ సభ్యు లు ఆర్ ఈశ్వర్, కె యశ్వంత్, ఆర్ రంగయ్య, ఎం శ్రీనివాస్‌రావు,ఎ.మహేందర్, బి.మహదేవ్ గౌడ్, ఎండీ.అజ్మత్ అలీ,కె.వాణి, కేంద్ర సంఘం అధ్యక్షుడు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి శ్రీ డాక్టర్. ఎస్‌ఎం హుస్సే ని (ముజీబ్) శాలువా, పుదీనా హర్‌తో సత్కరించారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్ యూనియన్ నగర శాఖ ప్రెసిడెంట్ శ్రీకాంత్, టీఎన్జీవోస్ యూనియన్ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి కురాడి శ్రీనివాస్, అసోసియేట్ ప్రెసిడెంట్లు కేఆర్ రాజ్‌కుమార్, వైస్ ప్రెసిడెంట్లు ఖలీద్ అహ్మద్, శంకర్, పబ్లిక్ సెక్రటరీ వైదిక్ శాస్త్ర, ఇసి శ్రీధర్, ముకీద్ , హైదరాబాద్ జిల్లా ఏపీఆర్‌ఓ మహ్మద్ వహీద్, ఉస్మాన్ అలీ ఉస్మాని, రామకృష్ణ రెడ్డి, మహ్మద్ ముస్తఫా షరీఫ్,పాల్గొన్నారు.