29 August, 2026 | 11:48 PM

టిఆర్ఎస్ పార్టీ ప్రవేశ పెట్టిన పంచాజన్య పథకాలే ప్రజలను పార్టీలోకి ఆహ్వానిస్తున్నాయి

29-08-2026 10:45 PM

టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు సాయగౌడ్

కామారెడ్డి,(విజయక్రాంతి): టిఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన పంచాజన్య పథకాలకు ఆకర్షితులై టిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సాయ గౌడ్ అన్నారు. శనివారం అడ్లూర్ ఎల్లారెడి గ్రామానికి చెందిన మంగళి నవీన్, మంగళి వేణు, చాకలి మధు, అస సాయి లతో పాటు మరో 10 మంది అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామస్తులు టిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి టిఆర్ఎస్ పార్టీ కండువా కప్పి టిఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత రానున్న రోజుల్లో చరిత్ర  తిరగరాసారన్నారు. ఎల్లారెడ్డి నియోజవర్గ ఇన్చార్జ్ సంపత్ గౌడ్ ఆధ్వర్యంలో టిఆర్ఎస్ జెండా ఎల్లారెడ్డిలో ఎగరడం ఖాయమన్నారు.ఈ కార్యక్రమం లో సోషల్ మీడియా ఇంచార్జి మోసర్ల శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.