30 August, 2026 | 12:40 AM

తెలుగు భాషా ఫోరం ఆధ్వర్యంలో పద్య పఠన పోటీలు

29-08-2026 11:28 PM

కొడిమ్యాల,(విజయక్రాంతి): జగిత్యాల జిల్లా భాషోపాధ్యాయులు మరో బృహత్తర కార్యక్రమానికి  శ్రీకారం చుట్టారు. తెలంగాణ భాషా దినోత్సవం సందర్భంగా తెలుగు భాషకు ఆయుపట్టు పద్యం. తెలుగు భాషా సొగసుకు శిఖరాగ్రమైన ప్రక్రియ పద్య సాహిత్యం.విద్యార్థులకు పద్యంపై మక్కువ పెంచడానికి, పద్యం విశిష్టతను, రసానుభూతిని తెలియజేయుటకై తెలుగు భాషా ఫోరం జగిత్యాల వారు పద్య పఠన పోటీలు నిర్వహించనున్నారు.

6,7 తరగతులు జూనియర్స్, 8,9,10 తరగతులు సీనియర్స్ విభాగాలలో సెప్టెంబర్ 2వ తేది మండల స్థాయి, సెప్టెంబర్ 8వ తేది జిల్లా స్థాయిలో నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రధానం చేయనున్నట్టు తెలుగు భాషా ఫోరం అధ్యక్షులు బి.శేషగిరి, కార్యదర్శులు డా.ఎం. గంగాధర్, కార్యవర్గ సభ్యులు తెలియజేశారు.