calender_icon.png 30 June, 2025 | 1:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రైవేట్ పాఠశాల నుండి ప్రభుత్వ పాఠశాలలో చేరిక

29-06-2025 07:19:48 PM

కొత్తపల్లి (విజయక్రాంతి): కరీంనగర్ పట్టణం(Karimnagar Town) విద్యానగర్ కు చెందిన మెండి సీత వెంకటేశ్వరరావు దంపతుల కూతురు మేఘన ప్రైవేటు పాఠశాల 5వ తరగతిలో నుండి రాంనగర్ లోని ప్రాథమిక పాఠశాలలో విశ్రాంత ఉపాధ్యాయులు నరహరి లక్ష్మరెడ్డి చొరవ చూపి చేర్పించారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ... ప్రభుత్వ పాఠశాలలు పుస్తకాలు, నోట్ బుక్స్, డ్రెస్సులు, స్కాలర్షిప్స్ అందిస్తూ, సుశిక్షుతులైన ఉపాధ్యాయులు విద్యాబోధన చేస్తున్నాయని, పేద, మధ్యతరగతి పిల్లలు ప్రైవేటు పాఠశాలల మోజులో పడకుండా ప్రభుత్వ పాఠశాలలోనే చదివించాలని తల్లిదండ్రులను కోరారు.