1 July, 2026 | 10:24 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

చండూరు మున్సిపాలిటీ నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి ఎన్నిక

29-06-2025 07:25 PM

చండూరు (విజయక్రాంతి): తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్(Telangana Municipal Workers and Employees Union) చండూరు మున్సిపాలిటీ అధ్యక్షులుగా బిపంగి నాగరాజు, ప్రధాన కార్యదర్శిగా ఇరిగి యాదగిరిని ఇటీవల చండూరు మండల కేంద్రంలో సిఐటియు మునుగోడు జనరల్ బాడీ విస్తృత స్థాయి సమావేశంలో వారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్న సందర్భంగా వారు మాట్లాడుతూ... మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తామని వారన్నారు.

కేంద్ర బిజెపి ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలని, పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం కార్మిక వర్గాన్ని బలిచ్చేందుకు తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలని వారన్నారు. కార్మిక వర్గం సమరశీల పోరాటాల ద్వారా సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి, వారి స్థానంలో నాలుగు లేబర్ కోడ్ ల ను ముందుకు తెచ్చిందని వారన్నారు. దశాబ్దాల పాటు కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను, హక్కులను భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కార్మిక వర్గంపై ఉందని, ప్రజల ఆస్తులను కార్పొరేట్లకు దోచిపెడుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.