ప్రతిభతోనే ఇక ప్రవేశాలు
- ఇంటర్ ప్రవేశాల కోసం ఇక ఆన్లైన్ విధానం
- ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్
- ఉపాధ్యాయులు తల్లిదండ్రుల హర్షం
నిర్మల్, మార్చి ౧౨ (విజయక్రాంతి): సర్వ శిక్ష అభియాన్‌లో నిర్వహించబడుతున్న కేజీబీవీ కళాశాలలో ఇక ఇంటర్ ప్రవేశాలు ప్రతిభ ఆధారంగా దక్కనున్నాయి. ఆర్థికంగా సామాజికంగా తల్లిదండ్రుల లేని పిల్లలకు ఇప్పటి వరకు ప్రవేశాలు కల్పించిన ప్రభుత్వం తాజా గా టీజీఆర్‌జెసి ఎల్లో సెట్ ప్రవేశ పరీక్ష ద్వారా ఇంటర్ సీట్లను భర్తీ చేసేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.
గత ఐదు సంవత్సరాల నుంచి కేజీబీవీ పాఠశాలలో కళాశాలలో కార్పొరేట్ స్థాయి విద్యను ఆంగ్ల మధ్యమంలో అమలు చేస్తున్న నేపథ్యంలో ప్రవేశాలకు తీవ్ర పోటీ నెలకొంది. దీంతో ప్రవేశ సందర్భంగా రాజకీయ ఫైరవులు ఒత్తిళ్లు సిఫార్సులు పెరిగిపోవడంతో ప్రవేశాల ప్రక్రియ లో కేజీబీవీ సిబ్బంది సిబ్బందికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం 2026 విద్యా సంవ త్సరంగాను కేజీబీవీలో ఇంటర్ ప్రవేశల కోసం సెట్ పరీక్ష నిర్వహించి ప్రతిభ మార్కుల ఆధారంగా సీట్లను కేటాయించారు.
నిర్మల్ జిల్లాలో మొత్తం 18 కేజీబీలు ఉండగా 16 కేజీబీల్లో ఇంటర్ తరగతులను నిర్వహిస్తున్నారు. ఐదవ తరగతి నుంచి ఇంటర్ వరకు విద్య బోధన అందిస్తున్నారు. కేజీబీపీ పాఠశాలలో ఎస్‌ఓతో ఒప్పంద అధ్యాపకులతో విద్య బోధన నిర్వహిస్తున్న నేపథ్యంలో ఇంటర్ విద్యను మరింత పారదర్శకంగా ప్రతిభను కనబరిచే విధంగా ఈ విద్యా సంవత్సరం నుంచి ఈ ప్రక్రియను అమలు చేస్తున్నారు
విద్యార్థులకు ఎంతో ప్రయోజనం
నిర్మల్ జిల్లాలో కేజీబీవీ కళాశాలలో గత ఐదు సంవత్సరాల నుంచి ఇంటర్లో మెరుగైన ఫలితాలు ర్యాంకులు సాధిస్తున్న నేపథ్యంలో కొన్ని కళాశాలలో ప్రవేశాల కోసం తీవ్ర పోటీ నెలకొంది. జిల్లాలోని నిర్మల్ లక్ష్మణ చెందా సారంగాపూర్ కల్లూరు, కుబీర్, కడెం, దస్తురాబాద్, ఖానాపూర్, మామడ, నరసాపూర్ , తానూర్, ముధోల్, సోన్, అనంతపేట్, పెంబి తదితర కేజీబీవీ కళాశాలలో ఇంటర్ బోధన నిర్వహిస్తున్నారు.
ఇంటర్‌లో ఎంపీసీ బైపిసి హెచ్‌ఈసి మల్టీపర్పల్ హెల్త్ వర్కర్ కంప్యూటర్స్ బ్యూటీషియన్స కోర్సులను అంది స్తున్నారు. జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేటు విద్యాసంస్థలో పదోతరగతి పరీక్షల్లో ఉత్తీర్ణుల వారికి ఇంటర్ ప్రవేశాల కోసం ప్రవేశపరీక్ష నిర్వహిం చి మెరిట్ ఆధారంగా ప్రవేశాలు కల్పించరున్నారు. గతంలో కేజీబీవీ పాఠశాలతో పాటు గ్రామీణ ప్రాంతాలు చదువుతున్న పిల్లలకు నేరుగా అడ్మిషన్లు స్వీకరించేవారు. దీంతో ఈ ప్రక్రియ జూన్లో ప్రారంభమై ఆగస్టు సెప్టెంబర్ వరకు కొనసాగడం వల్ల చదువులకు ఆటంకం ఏర్పడేది. మెరిట్ విద్యార్థులకు ప్రవేశాలు దొరకకుండా ప్రైవేట్ లో చదివించేవారు.
అయితే ప్రభుత్వం ప్రవేశల కోసం టిజిఆర్‌జెసి ఎల్లో సెట్ ప్రవేశ పరీక్ష ఈ విద్యాసంవత్సరించి నిర్వహించనుంది. ఈ పరీక్షలో ఇంటర్ ప్రవేశం పొందే విద్యార్థులు ఎంపీసీ బైపీసీ సంబంధిత కోర్సులను ఆక్షన్‌గా పెట్టుకుని ఆన్లైన్లో దరఖా స్తు చేసుకుని ప్రవేశపరీక్షలో వచ్చిన మార్కులు మెరిట్ ఆధారంగా సీట్లను కేటాయించారు. జూన్‌లోనే కేజీబీవీలో 100% ఇంటర్ ప్రవేశాలు కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల కేజీబీవీ అధ్యాపకులు పేద విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం నిర్ణయం మంచిది
కేజీబీవీ కళాశాలలో ఇంటర్ ప్రవేశాలు ప్రవేశపరిష ద్వారా నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ప్రవేశ పరీక్షల్లో మెరిట్ ఆధారంగా కోరుకున్న కోర్సులో ఇంటర్ ప్రవేశాలు పొందే అవకాశం ఉంది. ఇంటర్ కళాశాలలో నాణ్యమైన విద్య మౌలిక వసతులు ఉన్న నేపథ్యంలో పేద విద్యార్థులకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. ప్రవేశల ప్రక్రియ కూడా ఆన్లైన్లో నిర్వహించడం వల్ల పారదర్శకంగా ఉంటుంది. ఈ అవకాశాన్ని తల్లిదండ్రులు పిల్లలు సద్వినియోగం చేసుకోవాలి.
విమల, కేజీబీవీ ఎస్‌ఓ కడెం




