9 August, 2026 | 10:28 AM

సాంఘిక సంక్షేమ గురుకులాల్లో ప్రవేశాలు

26-05-2024 01:51 AM

ఇబ్రహీంపట్నం, మే 25: 2024 25 విద్యా సంవత్సరానికి గాను  తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో ఇంటర్మీడియట్ ప్రథ మ సంవత్సరంలో మిగిలి ఉన్న సీట్ల భర్తీ కోసం ఆసక్తి గల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ కూకుట్ల యాదయ్య శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. హైద రాబాద్, రంగారెడ్డి తూర్పు రీజియన్ పరిధిలోని శంషాబాద్, కందుకూర్, కొందుర్గు కళాశాలలో ఎంపీసీ, బైపీసీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా గల సాంఘీక సంక్షేమ గురుకుల సొసైటీ పరిధిలోని కళాశాలల్లో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ, హెచ్‌ఈసీ వొకేషన్ (వృత్తివిద్యా) కోర్సుల్లో ప్రవేశాల కొరకు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఈ ఏడాది పదవ తరగతి పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులు దరఖాస్తుకు అర్హులని తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు ఆన్‌లైన్‌లోని tgswreis. ac.in వెబ్‌సైట్‌లో రూ.100 చెల్లించి దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ నెల 24 నుండి 31వ తేది వరకు ధరఖాస్తుల స్వీకరణ ఉంటుందన్నారు.