9 August, 2026 | 9:11 AM

దేవుడి మాన్యాలను కాపాడాలి

26-05-2024 01:51 AM

కుమ్రంభీం ఆసిఫాబాద్, మే 25 (విజయక్రాంతి): దేవుడి మాన్యాలను కాపాడా లని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివా రం కాగజ్‌నగర్‌లోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. కాగజ్‌నగర్ మండలంలోని జగన్నాథ్‌పూర్ శివారులో ఉన్న భీమన్న ఆలయానికి చెందిన భూమిని రషీద్ అనే వ్యక్తి కబ్జా చేయడానికి చూస్తున్నారని ఆరోపించారు. ఆయనతో తహసీల్దార్, ఆర్డీఓ కుమ్మక్కైనట్లు ఆరోపించారు. ఈ విషయంపై భజరంగ్‌దళ్ నాయకులు ప్రశ్నించగా రూరల్  సీఐ రాంబాబు వారిపై దుర్భాషలాడడంతో పాటు బెదిరించారని ఆరోపించారు. సమావేశంలో కొంగ సత్యనారాయణ, శ్రీనివాస్ పాల్గొన్నారు.