18 July, 2026 | 4:17 PM

Breaking News

నిలకడగా అద్వానీ ఆరోగ్యం

16-12-2024 01:34 AM

న్యూఢిల్లీ, డిసెంబర్ ౧౫: బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ ఆరోగ్యం కుది ట పడినట్టు తెలుస్తోంది. హెల్త్ రిపోర్టులు వైద్యులు పరిశీలించిన అనంత రం అద్వానీని డిశ్చార్జ్ చేయనున్నట్టు సమాచారం. అయితే ఆయనను వై ద్యులు ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారనేదాని పై స్పష్టమైన సమాచారం లేదు. కాగా, వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ అద్వానీ ముందుగా ఎయిమ్స్‌లో అడ్మిట్  అయ్యారు.

కానీ ఆరోగ్య పరిస్థితి కాస్త ఆందోళనకరంగా ఉండటం తో శనివారం ఆయనను అపోలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అద్వానీ అపోలో ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. అద్వానీకి న్యూరో స్పెషలిస్ట్ డాక్టర్ వినీత్ సూరీ చికిత్స అందజేస్తున్నారు.