18 July, 2026 | 4:37 PM

బంగ్లాదేశ్‌లోని గుడి.. ఇండ్లు ధ్వంసం

16-12-2024 01:30 AM

ఢాకా, డిసెంబర్ 15:  బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. హిందువుల ఆస్తుల ను దుండగులు ధ్వంసం చేస్తూనే ఉన్నారు. తాజాగా దుండగులు సునమ్‌గంజ్ జిల్లాలోని ఓ గుడితో పాటు ఇండ్లను ధ్వంసం చేశారు. సునమ్‌గంజ్ పట్టణంలోని దోరాబజార్‌కు చెందిన ఆకాశ్‌దాస్ అనే వ్యక్తి ఈ నెల ఆరంభంలో హిందువులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ ఫేస్‌బుక్ లో పోస్ట్ పెట్టాడు.

పోస్ట్‌పై స్థానికంగా వ్యతిరేకత వ్యక్తమవడంతో ఆకాశ్ దాస్ ఫేస్‌బుక్ నుంచి ఆ పోస్ట్‌ను తీసేశాడు. అయినప్పటికీ అతడిపై అలీం హుస్సే న్, సుల్తాన్ అహ్మద్, ఇమ్రాన్ హుస్సే న్, షాజహాన్ హుస్సేన్‌తో పాటు పలువురు కక్ష పెంచుకున్నారు. వీరు ఇటీవ ల మూకుమ్మడిగా దోరాబజార్‌లోని ఓ హిందూ దేవాలయంతో పాటు పలువురి హిందువుల ఇండ్లను ధ్వం సం చేశారు. బాధితుల ఫిర్యాదు మేర కు పోలీసులు శనివారం అలీం హు స్సేన్, సుల్తాన్ అహ్మద్, ఇమ్రాన్ హుస్సేన్, షాజహాన్ హుస్సేన్‌ను అదుపులోకి తీసుకున్నారు.