7 May, 2026 | 11:05 PM

ఏఈ లంచం రూ.1.20 లక్షలు

18-06-2025 12:24 AM
  1. ఏసీబీకి చిక్కిన చర్లపల్లి డివిజన్ అసిస్టెంట్ ఇంజినీర్ 
  2. రూ.28 లక్షల బిల్లుకు రూ.2 లక్షలు డిమాండ్

ఘట్‌కేసర్, జూన్ 17: జీహెచ్‌ఎంసీ కా ప్రా సర్కిల్ చర్లపల్లి డివిజన్ కార్యాలయం లో విధులు నిర్వహిస్తున్న అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ -ఎలక్ట్రికల్) రూ.1.20 లక్షలు లం చం తీసుకుంటూ ఏసీబీకి చిక్కింది. చేసిన పనులకు బిల్లులు చెల్లించాలని ఓ కాంట్రాక్టర్ ఏఈ స్వరూపను కోరారు. రూ.28 లక్ష ల బిల్లు చెల్లించేందుకు రూ.2 లక్షలు లంచం ఇవ్వాలని కాంట్రాక్టర్‌పై ఏఈ ఒత్తి డి తీసుకొచ్చారు.

దీంతో చేసేది లేక బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. రంగారెడ్డి జిల్లా ఏసీబీ యూనిట్ ఆధ్వర్యంలో పతకం ప్రకారం బాధితుడి నుంచి ఏఈ స్వరూప మంగళవారం లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. గతంలో కూడా కాంట్రాక్టర్లను లంచాల పేరుతో ఇబ్బందులకు గురిచేసినట్టు ఆమెపై ఆరోపణలున్నాయి. ఏఈ స్వరూపను ఏసీబీ అధికారులు విచారణ అనంతరం ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు.