calender_icon.png 18 February, 2026 | 3:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అఫర్డబుల్ హెల్త్‌కేరే ప్రభుత్వ లక్ష్యం

18-02-2026 01:40:04 AM

  1. భౌగోళిక, ఆర్థిక, రాజకీయ మార్పునకు అనుగుణంగా బయో ఏషియా
  2. గ్లోబల్ హబ్‌ల సరసన హైదరాబాద్ నిలించింది
  3. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు 

హైదరాబాద్, ఫిబ్రవరి 17 (విజయక్రాంతి): హెల్త్ కేర్ రంగాన్ని ప్రజలకు అందుబాటులో, అఫర్డబుల్‌గా ఉంచాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. లైఫ్ సైన్సెస్ కంపెనీలు ఏఐ టెక్నాలజీ వినియోగించుకుని ముందుకు వెళ్లాలని సూచించారు. మంగళవారం హైటెక్స్ నిర్వహించిన బయో ఏషియా సదస్సు సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రీధర్‌బాబు మాట్లాడారు.

25 బిలియన్ డాలర్స్ పెట్టుబడులు సాధించాలన్నదే తెలంగాణ లైఫ్ సైన్సెస్ పాలసీ లక్ష్యమన్నారు. అందులో భాగంగానే లైఫ్ సైన్సెస్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని మం త్రి స్పష్టం చేశారు. ఫార్మా, వ్యాక్సిన్ తయారీ రాజధానిగా చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకు వెళ్తున్నదని పేర్కొన్నారు.

రెండేళ్లలో లైఫ్ సైన్సెస్ రంగానికి సంబంధించి రూ. 75 వేల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చామని, అయినా పెట్టుబడులు రావద్దని కొందరు దుష్ర్పచారం చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు.  ఒపెల్లా అనే ఫ్రాన్‌కు చెందిన గ్లోబల్ హెల్త్ కేర్ కంపెనీ పెట్టుబడులతో ముందుకువచ్చిందన్నారు. యూఎస్‌కు చెందిన ట్రైడెన్స్ కంపెనీ రూ. 300 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం కుదుర్చుకుందని, ఆర్‌ఎక్స్ ప్రొపెల్లంట్ కంపెనీ రూ. 1000 కోట్ల పెట్టుబడులు పెడుతున్నదన్నారు.