18-02-2026 01:21:51 AM
రేపు సీఎం, మంత్రులు ఢిల్లీకి రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై కాంగ్రెస్ అధిష్ఠానంతో చర్చ
హైదరాబాద్, ఫిబ్రవరి 17 (విజయక్రాంతి) : కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు పిలుపు వచ్చిం ది. సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్‌తో సహా మంత్రు లు, పార్టీకి చెందిన కీలక నేతలందరూ గురువారం హస్తినకు రావాలని ఏఐసీసీ ఆదేశాలు వచ్చాయి. గురువారం ఉదయం 10 గంటలకు ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం ఇందిరాభవన్‌లో జరిగే కీలక సమావేశానికి ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ, కేసీ వేణుగోపాల్ హాజరుకానున్నారు.
ఈ సమావేశంలో తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించే అవకాశం ఉంది. ఇక తెలంగాణలో మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయాలు, పార్టీ అంతర్గత సమావేశాలు, నాయకుల మధ్య మరింత సమ న్వయంతో పాటు భవిష్యత్‌లో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు తీసుకునే కార్యాచరణపై చర్చించే అవకాశం ఉందని సమాచారం. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపే తం చేసేందుకు అవసరమైన దిశానిర్దే శం చేయనున్నట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి.
దీంతో పాటు ప్రభుత్వం పనితీరు, ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ల అమలు, అమలు కాని అంశాలు, విపక్షాల విమర్శలు, ఎత్తుగడలను చిత్తు చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపైన పార్టీ అధిష్ఠానం తెలంగాణ నేతలతో చర్చించే అవ కాశం ఉంది. వీటితో పాటు సింగరేణి నైనీ కోల్ బ్లాక్ టెండర్లు, అందుకు సంబంధించిన పంచాయతీ, టెండర్లు రద్దు అంశంపై అధిష్ఠానం ఆరా తీసింది.
సింగరేణి టెండర్ల విషయంలో గందరగోళానికి కావడానికి గల కారణాలపైన చర్చించనున్నట్లు సమాచారం. మున్సిపల్, కార్పోరేషన్లు ఎన్నికల్లో మెజార్టీగా కాంగ్రెస్ కైవసం చేసుకోవడంతో.. ఇదే ఉత్సాహాన్ని కొనసాగిస్తూ త్వరలో జరగబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రేటర్ ఎన్నికల పైన ముందుకెళ్లే అంశాలపైన చర్చించనున్నారు. ఈ సమావేశంలోనే మంత్రివర్గ విస్త రణ, నామినేటెడ్ పోస్టుల భర్తీపైన స్పష్టత వ చ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు చె బుతున్నాయి.
సీఎం ముంబైయికి..
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శంషాబాద్ ఏయిర్‌పోర్టు నుంచి మంగళవారం ముంబై కి వెళ్లారు. ముంబైలో బుధవారం జరిగే ప్రతిష్టాత్మక ‘క్లుమైట్ వీక్’ అంతర్జాతీయ సదస్సుకు సీఎం రేవంత్‌రెడ్డి హాజరుకానున్నా రు. బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని జియో కన్వెన్షన్ సెంటర్‌లో సదస్సు జరగనుంది. ఈ క్లెమేట్ సదస్సును ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రారంభించనున్నారు. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఆహ్వానం మేరకు సీఎం రేవంత్‌రెడ్డి ముంబైకి వెళ్లారు.
సదస్సులో సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ రాష్ట్ర అభివృద్ది, హైదరాబాద్ విస్త్రృత ప్రగతి, పరిపాలన, పర్యావరణ పరిరక్షణ, గ్రీన్ ఎనర్జీ, సుస్థిర అభివృద్ది అనే అంశంపై సీఎం ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమం ముగిసిన వెంటనే సీఎం రేవంత్‌రెడ్డి ముంబై నుంచి ఢిల్లీకి వెళతారు. గురువారం పార్టీ అధిష్ఠా నం పెద్దలతో జరిగే సమవేశంలో పాల్గొంటారు. ఆ తర్వాత కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ నిధులు, విభజన హామీలు, అభివృద్ధి ప్రాజెక్టుల విషయంలో చర్చించే అవకాశం ఉంది.