calender_icon.png 22 January, 2026 | 4:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘లైఫ్ సైన్సెస్’ భవిష్యత్‌లో తెలంగాణ పాలసీ

22-01-2026 02:55:17 AM

  1.   2030 నాటికి గ్లోబల్ టాప్-5 లైఫ్ సైన్సెస్ క్లస్టర్‌గా ఎదగడంపై దృష్టి
  2. ఆ దిశగా నూతన పాలసీ రూపకల్పన
  3. దావోస్ వేదికగా ఆవిష్కరించిన సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు
  4. ప్రతి జులైలో వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ఫాలో అప్ సదస్సు  

హైదరాబాద్, జనవరి 21 (విజయక్రాంతి) : లైఫ్ సైన్సెస్ రంగంలో అద్భుత మైన పురోగతి సాధించి ప్రపంచ లైఫ్ సైన్సె స్ రంగానికి కేంద్రంగా మారాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. లైఫ్ సైన్సెస్ రంగంలో అద్భుతమైన భవిష్యత్‌ను సృష్టించడంలో భాగంగా కీలకమైన ముందడుగు వేసింది. లైఫ్ సైన్సెస్ రంగం అభివృద్ధి కోసం దోహదపడే అంశాలు, పెట్టుబడులను ఆకర్షించేందుకు అవలంభించే విధా నాలతో నూతన పాలసీని రూపొందించిం ది. తెలంగాణ ప్రభుత్వం ప్రపంచ స్థాయి ఆశయాలతో రూపొందించిన ‘లైఫ్ సైన్సెస్ పాలసీ 2026---30’ను దావోస్‌లో కొనసాగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సు లో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు ఘనంగా ఆవిష్కరించారు.

ఈ పాలసీ ద్వా రా 2030 నాటికి తెలంగాణను ప్రపంచంలోని అగ్రగామి ఐదు లైఫ్ సైన్సెస్ క్లస్టర్లలో ఒకటిగా అభివద్ధి చేయడమే ప్రధాన లక్ష్యం గా పెట్టుకున్నారు.ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యంత విశ్వసనీయమైన బయో సైన్సెస్ పర్యావరణ వ్యవస్థను నిర్మిస్తున్నామని, తెలంగాణ నుంచి ప్రపంచ ఆరోగ్య రంగంపై ప్రభావం చూపుతున్నామని స్పష్టం చేశారు. గ్లోబల్ భాగస్వామ్యాలే భవిష్యత్ వృద్ధికి ఆధారమని అన్నారు.

మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ గత రెండేళ్లలో రూ. 73 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, కొత్త పాలసీతో వచ్చే ఐదేళ్లలో రూ. 2 లక్షల కోట్ల పెట్టుబడుల లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. కాగా ప్రతి ఏడాది జులైలో హైదరాబాద్‌లో డబ్ల్యూఈఎఫ్ ఫాలో -అప్ సదస్సు నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రతిపాదించగా గ్లోబల్ బిజినెస్ లీడర్లు, పాలసీ నిర్ణేతలు ఏకగ్రీవంగా మద్దతు తెలిపారు.