calender_icon.png 16 October, 2025 | 12:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంత్రి శ్రీధర్‌బాబుకు అరుదైన గౌరవం

16-10-2025 02:16:40 AM

-‘ఆస్‌బయోటెక్ కాన్ఫరెన్స్‌లో కీలకోపన్యాసం చేసే అవకాశం

-దేశంలో ఈ గౌరవం దక్కిన ఏకైక మంత్రి శ్రీధర్‌బాబు

 హైదరాబాద్, అక్టోబర్ 15 (విజయక్రాంతి) : ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు అరుదైన గౌరవం దక్కింది. లైఫ్ సెన్సైస్ రంగంలో ‘ఆసియా ప్రాంతం లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా పరిగణించే ‘ఆస్‌బయోటెక్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ 2025’లో కీలకోపన్యాసం చేసే అవకాశం లభించింది.

ఈ నెల 21 నుంచి 24 వరకు ఆస్ట్రేలియా లైఫ్ సై న్సెస్ అత్యున్నత నిర్ణాయక సంస్థ ‘ఆస్‌బయోటెక్’, విక్టోరియా రాష్ర్ట ప్రభుత్వ సంయుక్త నిర్వ హణలో మెల్‌బోర్న్‌లో జరగనున్న ఈ సదస్సులో భారత్ నుంచి ప్రసంగించే అవకాశం మంత్రి శ్రీధర్‌బాబుకే దక్కింది. రెండేళ్లలో తెలంగాణ లైఫ్ సెన్సైస్ రంగం సాధించిన పురోగతి, భవిష్యత్ ప్రణాళికలు, అవకాశాలు, ఇక్కడ పెట్టుబడులకు ఉన్న అనుకూలతలపై ఆయన ప్రసంగించనున్నారు.

ఆస్ట్రేలియా కాన్సుల్ జనరల్  హిల్లరీ మెక్‌గీచీ బుధవారం మంత్రి శ్రీధర్ బాబును ప్రత్యేకంగా కలిసి ఆహ్వానించారు. సీఎం రేవంత్ రెడ్డి మార్గనిర్దేశంలో ‘గ్లోబల్ ఫార్మా, బయో టెక్నాలజీ, మెడ్‌టెక్’ ఆవిష్కరణ హబ్‌గా తెలంగాణ ను తీర్చి దిద్దేందుకు మంత్రి శ్రీధర్ బాబు చేస్తున్న కృషిని ఆమె ప్రత్యేకంగా అభినందించారు. ‘ఆస్ట్రేలియా -తెలంగాణ’ మధ్య ద్వుపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు చొరవ చూపాలన్నారు.

‘ఈ ఆహ్వా నం లైఫ్ సెన్సైస్ రంగంలో తెలంగాణ సాధించిన పురోగతికి దక్కిన గౌరవం. ప్రపంచవ్యాప్తంగా ఏడు అగ్రశ్రేణి లైఫ్‌సెన్సైస్ క్లస్టర్లలో హైదరాబాద్ ఒకటిగా నిలిచింది. ఈ జాబితాలో స్థానం దక్కించుకున్న ఏకైక భారతీయ నగరం మనదే. ఈ రంగంలో కొత్తగా రూ.63 వేలకోట్ల పెట్టుబడులను తీసుకొచ్చాం. మరిన్ని తెచ్చేందుకు ఈ వేదికను వినియోగించుకుంటాం. ఆస్ట్రేలియా తెలంగాణ మధ్య ద్వుపాక్షి క సంబంధాల బలోపేతానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషిచేస్తోంది’ అని మంత్రి పేర్కొన్నారు.