17 April, 2026 | 3:10 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయా దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

గృహిణికి సైబర్ మోసం

21-02-2026 01:37 AM

జలమండలి అధికారులమని  95 వేలు కాజేసిన కేటుగాళ్లు

మేడిపల్లి, ఫిబ్రవరి 20 (విజయక్రాంతి): వాటర్ బోర్డు అధికారి అని ఫోన్ చేసిన సై బర్ నేరగాళ్లు ఓ గృహిణి ఖాతా నుంచి రూ. 95 వేలు కాజేసిన ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పీర్జాదిగూడకు చెందిన ఉమ(33)కు హెచ్‌ఎం డబ్ల్యు ఎస్‌ఎస్‌బి అధికారినని, మీటర్ రీడింగ్ అప్డేట్ కాలేదని, ’మీటర్ అప్డేట్ చేసుకోవాలని ఏపీ కే ఫైల్‌ను ఇన్‌స్టాల్ చేయాలని సూచించారు.

వారు చెప్పినట్టే ఉమ చేయడంతో ఫోన్‌ను సైబర్ నేరగాళ్ల ఆధీనంలోకి తెచ్చుకుని, ఆమె ఖాతా నుంచి రూ.95 వేలను  బదిలీ చేసుకున్నారు. ఈ విషయంపై ఉమ మేడిపల్లి పోలీసులకు  ఫిర్యాదు చేసింది.