15 April, 2026 | 12:53 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

హోటల్‌లో పేలిన ఇడ్లీ స్టీమర్

21-02-2026 01:36 AM
  1. నలుగురు కార్మికులకు గాయాలు

ఎల్బీనగర్‌లోని ‘చట్నీస్’లో ఘటన

ఎల్బీనగర్, ఫిబ్రవరి 20: హోటల్‌లో ఇడ్లీ తయారు చేసే స్టీమర్ పేలిన ప్రమాదంలో నలుగురు కార్మికులు తీవ్రంగా గాయపడిన ఘటన శుక్రవారం ఎల్బీనగర్‌లోని చట్నీస్ హోటల్‌లో చోటు చేసుకుంది. చట్నీస్ హోటల్‌లో మధ్యాహ్న ప్రాంతంలో ఇడ్లీ తయారు చేసే స్టీమర్ పేలింది.

ఈ ప్రమాదంలో నలుగురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. పేలుడు ధాటికి హోటల్ లో ఉన్న కస్టమర్లు భయంతో బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న ఎల్బీనగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.

ముగ్గురు కార్మికులకు కాలిన గాయాలు కాగా, ఒక కార్మికుడికి ఇనుప ప్లేట్ తాకడంతో తలకు తీవ్రంగా గాయప డ్డాడు. పోలీసులు వారిని ఎన్టీఆర్ నగర్లోని ఆద్య ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన జోగేశ్వర్(20), దయా(23), సుమిత్(21), సునీల్ (21) ఉన్నారు. ఎల్బీనగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.