22-02-2026 01:54:10 AM
ఖైరతాబాద్, ఫిబ్రవరి 21 (విజయాక్రాంతి): ఔట్ సోర్సింగ్ విధానంలో ఏజెన్సీ వ్యవస్థను తక్షణమే రద్దు చేయాలని ప్రభుత్వమే నేరుగా జీతాలు చెల్లించాలని సీనియర్ జర్నలిస్టు విఠల్, తెలంగాణ ఉద్యమకారులు పృథ్వీరాజ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో తెలంగాణ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జెఎసి కమిటీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి వారు ముఖ్య ఆతిధులుగా విచ్చేసి మాట్లాడుతూ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు చట్టబద్ధమైన ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు.
పెండింగ్ జీతాలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. జెఎసి కమి టీ చైర్మన్ పులి లక్ష్మయ్య, ప్రధాన కార్యదర్శులు శ్రీధర్, దుర్గం శ్రీనివాస్ మాట్లాడు తూ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల డిమాండ్ల సాధనకు ఈ నెల 28న హైదరాబాద్ కేంద్రంగా భిక్షాటన కార్యక్రమం, మార్చి 7న అన్నిజిల్లా కేంద్రా ల్లో మానవహారం, మార్చి 14న ఇందిరాపార్కు వద్ద మహాధర్నా, ఏప్రిల్ 11న చలో ఢిల్లీ ద్వారా రాహుల్ గాంధీని కలిసి ఏజెన్సీ వ్యవస్థ రద్దుకు వినతిపత్రం అందజేస్తామని తెలిపారు