6 July, 2026 | 10:11 AM

భారత్‌కు వ్యవసాయరంగమే కీలకం

11-06-2024 02:34 AM

మెరుగైన వంగడాలు అందించడం హర్షణీయం

మోదీ పాలనలో రైతు ఆత్మహత్యలు తగ్గుముఖం

విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాలి 

పీజేటీఎస్‌ఏయూ స్నాతకోత్సవంలో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ 

హైదరాబాద్/రాజేంద్రనగర్ , జూన్ 10 (విజయక్రాంతి) : భారతదేశానికి వ్యవసాయ రంగమే కీలకమని, మానవ మనుగడకూ ప్రధాన ఆధారమని తెలంగాణ గవర్నర్, పీజేటీఎస్‌ఏయూ కుల పతి సీపీ రాధాకృష్ణన్ పేర్కొన్నారు. సోమవారం రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో జరిగిన ఆరవ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈసందర్భంగా మాట్లాడుతూ.. అత్యధిక జనాభా కలిగిన భారతదేశం తన అవసరాల కోసం వ్యవసాయ దిగుమతులపై ఆధారపడే  స్థితిలో లేద ని వివరించారు.  రైతులు, పరిశోధన, ప్రయోగ ఫలితాలను ప్రత్యక్షంగా చూస్తే వాటిని స్వీకరిస్తారని, శాస్త్రవేత్తలు ఈ విషయాలు గుర్తించాలని చెప్పారు. నీటి సమర్థ యాజమాన్యం ఉత్పత్తి, ఉత్పాదకతల పెంపుపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.  వ్యవసాయానికి కీలకం వితన్తం అని,  యూనివర్శి టీ మెరుగైన వండాలను రైతులకు అందించడం హర్షణీయమన్నారు. 

విద్యార్ధి దశ నుంచి ఉద్యోగ దశలోకి ప్రవేశిస్తున్న  విద్యార్థులు ఆత్మవిశ్వాసం, అంకితభావంతో ముందుకు వెళ్లాలని, జీవితంలో ఒడిదొడుకులు సహజమని, వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలని పిలుపు నిచ్చారు. అన్ని విషయాల్లో పాశ్చాత్య ధోరణులను గుడ్డిగా అనుసరించవద్దని హితువు పలికారు.  నరేంద్రమోదీ పాలనలో రైతుల ఆత్మహత్యలు తగ్గాయని పేర్కొన్నారు. అనంతరం స్టేట్ బ్యాంక్ ఎండీ చల్లా శ్రీనివాస్ ప్రసంగిస్తూ  ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలకు చెందిన తాను ఈ వ్యవసాయ కళాశాల్లోనే చదివానని, తాను నేడు ఈస్థానంలో ఉన్నందుకు  గర్విస్తున్నానన్నారు.

77 ఏళ్ల స్వతంత్ర భారతదేశం అనేక రంగాల్లో అభివృద్ది చెందిందని త్వరలోనే ప్రపంచంలోనే మూడవ ఆర్థివ వ్యవస్థగా అవతరించనున్నదని అనేక ప్రపంచ సంస్థలు  అంచనా వేస్తున్నాయన్నారు. 2047 నాటి కి వికసిత్ భారత్‌గా పరిణమించనున్నామని వివరించారు. వాతావరణ మార్పులకు అనుగుణంగా వ్యవసాయ రంగం అభివృద్దికి అధునాతన టెక్నాలజీలు దోహదం చేయాలన్నారు.  వ్యవసాయంతో పాటు చేపల పెంపకం, నూనెగింజల ఉత్పత్తి,  ఉత్పాదతకతల పెరగడం, పౌల్ట్రీ రంగ అభివృద్ధితో దేశంలో ఇంద్రధనస్సు విప్లవం సాగుతుందన్నారు.

అదే విధంగా విశ్వవిద్యాలయం సాధించిన ప్రగతిని రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి , ఏపీసీ, విశ్వవిద్యాలయం ఉపకులపతి రఘనందన్‌రావు వివరించారు. ఈ సందర్భంగా  587 మందికి అండర్ గ్రాడ్యుయే ట్ పట్టాలను, 165 మందికి  పీహెచ్‌డీ, పోస్టు గ్రా డ్యుయేట్, 11 మంది పీజీ విద్యార్థులు 12 బంగారు పతకాలు, 8 మంది యూజీ విద్యార్థులు 19 బంగా రు పతకాలు సాధించారు. వీరిని గవర్నర్ రాధాకృష్ణన్, శ్రీనివాసులు శెట్టి, ఉపకులపతి అభినం దించారు. బజ్జూరి దివ్య, వెలిచాల సాయి ప్రత్యూష చెరో ఆరు బంగారు పతకాలు సాధించారు. ఈ కా ర్యక్రమంలో విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డాక్టర్ రఘరామిరెడ్డి,  వర్సిటీ అధికారులు, పూర్వ ఉప కులపతు లు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.