17 April, 2026 | 8:26 PM

Breaking News

ప్రాథమిక ఆరోగ్య వైద్య కేంద్రంలో అరైవ్-అలైవ్ సేఫ్టీపై అవగాహన   •   మా పట్టా భూమిలో ఎటువంటి నిర్మాణం చేపట్టొద్దు: పుట్ట వెంకటమ్మ   •   ప్రభుత్వమే మమ్ములను సమ్మెలోకి నెట్టుతుంది   •   స్థలం కేటాయిస్తే బస్టాండ్ నిర్మాణం కోసం కృషి చేస్తాం   •   మున్సిపల్ కార్యాలయం వద్ద చలివేంద్రం ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ రాజు   •   పీజీ, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు నాల్గవ సెమిస్టర్ పరీక్ష రుసుము నిర్ధారణ   •   ఉద్యమ రిజిస్ట్రేషన్ గురించి వివోఏలకు అవగాహన   •   శాతవాహనలో నల్ల బ్యాడ్జీలతో నిరసన   •   మల్లాపూర్‌లో బీజేపీ ఎంపీ దిష్టిబొమ్మ దహనం   •   ఎర్రకుంట స్మశాన వాటికలో చెట్ల తొలగింపు   •  

కాంగ్రెస్ పాలనలో దండగైన వ్యవసాయం

25-06-2025 01:52 AM

పదేళ్ల పాలనలో పండగైంది: కేటీఆర్

హైదరాబాద్, జూన్ 24 (విజయక్రాంతి): దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో వ్యవసాయం దండగైందని, పదేళ్ల కేసీఆర్ పాలనలో పండగైందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో మళ్లీ దండగయిందని, రూ.10 వేల రైతుబంధు స్థానంలో రూ.15 వేలు రైతుభరోసా ఇస్తామని ఓట్లు దండుకుని రూ.12 వేలకు కుదించడం సంబరమా అని ఎక్స్‌లో మంగళవారం ట్వీట్ చేశారు. రైతుభరోసా రెండు సార్లు ఎగ్గొట్టి ఇప్పుడు మళ్లీ ఓట్ల కోసం ఆగమేఘాల మీద డబ్బులు వేయడం సంబరమా అన్నారు.

సాగు నీటితో రైతుకు ప్రోత్సాహం ఇచ్చి, ఉచిత కరెంటుతో సాగుకు ఊతమిచ్చి, పంట పెట్టుబడికి రైతుబంధుతో వెన్నుదన్నుగా నిలిచి, రైతు ఏ కారణం చేత మరణించినా రైతు కుటుంబాలకు  రూ.5 లక్షల రైతుబీమాతో ధీమానిచ్చిన దార్శనికుడు కేసీఆర్ అన్నారు. రైతుభరోసా ఎగ్గొట్టి, రైతుబీమా పక్కనపెటి,్ట రుణమాఫీని తుంగలో తొక్కి, క్వింటాలుకు రూ.500 బోనస్ కు సున్నం పెటి,్ట కల్లాలలో ధాన్యం కొనకుండా కన్నీళ్లు పెట్టించి రైతులను పండగ చేసుకోమంటారా అని కేటీఆర్ ప్రశ్నించారు.