17 April, 2026 | 9:56 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

ఏసీబీకి చిక్కిన గ్రామ కార్యదర్శి

25-06-2025 01:51 AM

నిర్మల్, జూన్ 24 (విజయక్రాం తి): నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మం డలం గుడిసెరాల గ్రామానికి చెందిన పంచాయతీ కార్య దర్శి శివకృష్ణ మం గళవారం రూ.12వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికినట్టు డీఎస్పీ మధు తెలిపారు. గుడిసెల గ్రామానికి చెందిన గొలుసుల రాజే శం గ్రామంలో కొత్త వాటర్ ప్లాంట్ ఏర్పా టు చేసుకోవడానికి గ్రామపంచాయతీ నుం చి ఎన్‌ఓసీ కోసం గ్రామ కార్యదర్శి శివరామ కృష్ణను ఆశ్రయించారు.

ఎన్‌ఓసీ కావాలం టే రూ.15 వేలు ఇవ్వాలని గ్రామ కార్యదర్శి డిమాండ్ చేశాడు. చివరకు 12 వేలకు బేరం కుదుర్చుకున్నారు. ఈ విషయాన్ని ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చిన రాజేశం.. మంగళవారం ప్రకృతి వనం వద్ద రూ.12 వేల నగదును కార్యదర్శి అందించారు. వెంటనే ఏసీబీ అధికారులు దాడి చేసి శివ రామకృష్ణను పట్టుకొని అరెస్ట్ చేశారు.