15 April, 2026 | 12:39 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

ఒక్కరు కూడా బతికే అవకాశం లేదు: అహ్మదాబాద్ సీపీ

12-06-2025 06:24 PM

అహ్మదాబాద్: గుజరాత్‌ అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం(Sardar Vallabhbhai Patel International Airport) నుంచి లండన్ బయల్దేరిన ఎయిరిండియా ఫ్లైట్ నెంబర్ ఏఐ-171 విమానం కూలిపోయింది. ప్రమాద మరణాలపై అహ్మదాబాద్ సీపీ జ్ఞానేంద్ర సింగ్ మాలిక్(CP Gyanendra Singh Malik) ఆసక్తికర ప్రకటన చేశారు. ఈ విమాన ప్రమాదంలో ఒక్కరు కూడా బతికే అవకాశం లేదని వెల్లడించారు. ఏపీ(Associated Press) అనే అంతర్జాతీయ మీడియా సంస్థతో అహ్మదాబాద్ సీపీ ఈ విషయాన్ని తెలుపుకున్నారు. కాగా, ఎయిరిండియా విమానంలో 230 మంది ప్యాసింజర్లు, 10 మంది సిబ్బంది, ఇద్దరు పైలట్లు ఉన్న విషయం తెలిసిందే. అలాగే విమాన దుర్ఘటనలో అహ్మదాబాద్ పోలీసులు 25 మంది క్షతగాత్రుల వివరాలను వెల్లడించారు.