4 July, 2026 | 11:50 AM

పెద్దమల్లారెడ్డిలో గ్రామపంచాయతీ ట్రాక్టర్ దొంగతనం

04-07-2026 10:45 AM

మోటార్ పైపులు, ప్రహరీ గోడ ధ్వంసం

భిక్కనూర్, జూలై 4(విజయక్రాంతి): భిక్కనూర్ మండలం పెద్దమల్లారెడ్డి గ్రామపంచాయతీకి చెందిన ట్రాక్టర్ దొంగతనానికి గురైన ఘటన గ్రామంలో కలకలం రేపింది. స్థానిక సమాచారం ప్రకారం, అదే గ్రామానికి చెందిన కొందరు యువకులు ఈ ఘటనకు పాల్పడినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. దొంగిలించిన ట్రాక్టర్‌తో హల్చల్ చేస్తూ గ్రామపంచాయతీ ప్రహరీ గోడను ఢీకొట్టడంతో కొంత భాగం ధ్వంసమైంది.ఇదిలా ఉండగా  గ్రామ ప్రధాన కూడలైన హనుమాన్ దేవాలయం సమీపంలో ఉన్న బోరు మోటారు పైపులను కూడా ధ్వంసం చేసినట్లు తెలిపారు. గ్రామస్థులు భిక్కనూర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉండగా,దీంతో గ్రామంలో ఆందోళన నెలకొంది.