28 August, 2026 | 2:00 PM

Breaking News

జర్నలిస్టులకు రాఖీ కట్టి.. హెల్మెట్లు అందించిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్   •   రక్షాబంధన్‌ పండుగ.. మన బంధాలకు ప్రతీక: ఎమ్మెల్యే పాయల్‌ శంకర్   •   బసవరాజు శ్రీనివాస్ పై నీలాప నిందలు మానేయండి   •   సీఐ అత్యుత్సాహం.. ఆందోళనకారులపై దాడి   •   శిశుమందిర్ విద్యార్థుల సౌభ్రాతృత్వ సందేశం   •   ముత్తారం మాజీ జడ్పీటీసీని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు   •   కిక్కిరిసిన బస్సులు.. కిటకిటలాడుతున్న బస్టాండ్లు   •   మాజీ మంత్రి కోట్నాక భీంరావు వర్ధంతిని విజయవంతం చేయాలి   •   జర్నలిస్టులకు రాఖీ కట్టిన ఎస్సై గుగులోత్ శ్రీదేవి   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం మహాధర్నా   •  

మురుగు కాలువలో తాగునీటి పైపులైన్

04-07-2026 10:43 AM

చేర్యాల, (విజయక్రాంతి): స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే ఉద్దేశంతో ప్రారంభించిన మిషన్ భగీరథ పథకం చేర్యాల పట్టణంలో అధ్వానంగా మారింది. పట్టణంలోని నాలుగవ వార్డు పరిధిలో బాలాజీ టాకీస్ మూల వద్ద మురుగునీరు కాలువ ప్రాంతంలో ప్రతి ఇంటికి తాగునీరు సరఫరా చేసే మంచినీటి పైపులైన్ ఉండడం వర్షాకాలం సీజనల్ వ్యాధులు ప్రబలే సమయంలో స్థానికుల్లో ఆందోళన కలిగిస్తోంది. భగీరథ పైపులు దెబ్బతిని మురుగు నీరు మంచి నీరు కలికి ఇళ్లకు చేరుతుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలిగిన పోయిన పైపులైన్‌ను వెంటనే సరిచేయాలని మున్సిపల్ అధికారులను సిబ్బందిని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.అధికారులు స్పందించకపోతే ఆందోళన చేపడతామని ప్రజలు హెచ్చరిస్తున్నారు.