4 July, 2026 | 11:15 AM

చిరుజల్లులకి చిత్తడిగా మారిన చింతల బోరి రోడ్లు

04-07-2026 10:42 AM

బోథ్: సోనాల మండలంలోని చింతల బోరి గ్రామంలో ఉన్న అందరిగా జరుగును ఇటీవల కురిసిన వర్షాలకు చిత్తడిగా మారాయి. దీంతో గ్రామస్తులకు నడక కష్టంగా మారిందని వాపోతున్నారు. అధికారులు అంతర్గత రోడ్ల విషయంలో శ్రద్ధ కనబరిచి వర్షాకాలం ఇబ్బందులు లేకుండా చూడాలని కోరుతున్నారు రాత్రిపూట నడవడం మరింత కష్టంగా మారిందని పలుకాలనీల వాసులు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టినట్లయితే ఇబ్బందులు తొలగిపోయే ఆస్కారం ఉందని పేర్కొంటున్నారు.