రైతాంగ సమస్యల పరిష్కారం కోసం ఏఐకేఎమ్‌ఎస్ ధర్నా
భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 10,(విజయక్రాంతి): పత్తి, మొక్కజొన్న, వరి ధాన్యా న్ని ప్రభుత్వo కొనుగోలు చేయాలనీ ,సరిపడ కేంద్రాలను ఏర్పాటు చేసి 100% పంటను ప్రభుత్వమే సేకరించాలనీ డిమాం డ్స్ తో సోమవారం కలెక్టర్ కార్యాల యం ముందు అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్), భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యవర్గం నాయకత్వన రైతులు రెండున్నర గంటల పాటు ధర్నా నిర్వహించారు. అనంతరం జాయింట్ కలెక్టర్ కి వినతిపత్రం ఇ చ్చారు.
ఈ సందర్భంగా ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు తుపాకుల నాగేశ్వరావు అధ్యక్షత వహించగా, ఏఐకేఎంఎస్ తెలంగాణ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వి కోటేశ్వరరావు మాట్లాడారు. 20 -20 వ్యవసాయ నూతన చట్టాల ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలని డి మాండ్ చేశారు. మన దేశ పంటల ఎగుమతులపై ఆంక్షలు విధించిన దేశాలకు సంబం ధించి దిగుమతులపై, కూడా మనదేశంలో ఆంక్షలు సుoఖాలు విధించాలన్నారు. విదేశీ పత్తి, మొక్కజొన్న, వరి, ఇతర వ్యవసాయ పంటలు దిగుమతులపై 50% సుంకాలను విధించాలని డిమాండ్ చేశారు. దేశ వ్యవసాయం మార్కెట్లో ఏర్పడుతున్న సంక్షోభల ను ప్రతి స్తంభాలను, కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలే ప్రధాన కారణమని తెలిపారు.
నరేంద్ర మోడీ ప్రభుత్వం విదేశీ మా ర్కెట్ కి ఆశపడి ఆంక్షలు లేకుండా దిగుమతి చేసుకోవడం వల్ల మన దేశంలో పండిన పంటలు, ఎక్కడ అమ్ముకోవాలో ఎవరికి అ మ్ముకోవాలో ఈ మోడీ ప్రభుత్వమే చెప్పాలని ఆయన ప్రశ్నించారు? నేడు కేంద్ర ప్ర భుత్వం, ఎకరానికి ఐదు క్వింటాలే కొంటామ ని, మిగతాది మీరు ఎక్కడైనా అమ్ముకోం డి ప్రభుత్వం ఇంతే కొనుగోలు చేస్తుంది అని చెప్పడంతో, రైతులు ఈ దేశంలో పండించిన పంటను ఇంకెక్కడ అమ్ముకోవాలో ఈ రైతులకు అర్థం కావడం లేదని, చేతికొచ్చిన పంట తుఫానుతో తడిసి నేలమట్టాయి అధి క దుఃఖంలో ఉన్న రైతులకు ఎకరాకు 5 క్విం టాలే కొంటామని చెప్పిన ఈ ప్రభుత్వ ఆం క్షలు మరింత ఊబిలోకి నెట్టబడ్డాయని అ న్నారు.
సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ అవునూరి మధు మాట్లాడుతూ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మొత్తం ఏజెన్సీ ప్రాంతమని, గ్రామాల లో రోడ్లు రాకపోకలు రవాణా సౌకర్యం సరి గా లేదని కాబట్టి పండించిన పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయడం కోసం ఏజెన్సీ గ్రామాలలో, కొనుగోలు కేంద్రాలను ప్రభు త్వం ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు. అనంతరం జాయిం ట్ కలెక్టర్ మాట్లాడుతూ, రైతులు కంగారు పడాల్సిన విష యం ఏమీ లేదని కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం కోసం ప్రభు త్వ అధికారులతో మాట్లాడి ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నాను విరవించా రు.
ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి గౌని నాగే శ్వర్ రా వు, ఏఐకేఎంఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ముక్తి సత్యం, జిల్లా కార్యదర్శి ఏనుగు చం ద్రం, రాష్ట్ర నాయకులు ఎస్ కే ఉమర్, ఏ ఐ కె ఎ మ్ ఎస్ జిల్లా సహాయ కార్యదర్శి బట్టు ప్ర సాద్,కుంజ కృష్ణ,ఉపాధ్యక్షులు హర్జ్య, జి ల్లా కోశాధికారి జక్కుల రాంబాబు,జిల్లా నా యకులు కోరం సీతారాములు పూణెం రంగ య్య, పొడుగు నరసింహారావు, కల్తి వెంకటేశ్వర్లు, బత్తుల సత్యం ఆరేం నరేష్,గడ్డం లా లయ్య, మేస్ గోపాల్, అటికం శేఖర్,భూక్య మాంగ్య, మాజీ సర్పంచ్ లు సఫావట్ సరో జ,సంతు, మోకాళ్ళ కృష్ణ,మూయన్న, ఏఐటిఎఫ్ జిల్లా కన్వీనర్ మోకాళ్ళ రమేష్,పి వై ఎల్ జిల్లా ఏఐటిఎఫ్‌ఉపాధ్యక్షుడు ముసలి సతీష్,పి ఓ డబ్ల్యు జిల్లా అధ్యక్షురాలు ఆదిలక్ష్మి, మోతిలాల్, తదితరులు పాల్గొన్నారు.




