calender_icon.png 11 November, 2025 | 3:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గిరిజన దర్బార్‌లో ఇచ్చిన అర్జీలకు సత్వరమే పరిష్కారం చూపించండి

11-11-2025 12:00:00 AM

యూనిట్ అధికారులను ఆదేశించిన ఐటీడీఏ పీవో రాహుల్ 

భద్రాచలం, నవంబర్ 10, (విజయక్రాంతి):ఎంతో నమ్మకంతో మారుమూల ఆదివాసి గిరిజన గ్రామాలలో నివసిస్తున్న గిరిజన కుటుంబాలు ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు, వివిధ రకాల సమ స్యల గురించి గిరిజన దర్బార్లో అర్జీలు పెట్టుకునే గిరిజనులకు సంబంధిత యూనిట్ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు మరియు వారి సమస్యలను పరిష్కరించడానికి కృషి చేయాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు.

సోమవారం ఐటీడీఏ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన గిరిజన దర్బార్లో వివిధ ఆదివాసి గిరిజన గ్రామాల నుండి వచ్చిన గిరిజనుల నుండి అర్జీలు స్వీకరించారు. తన పరిధిలో ఉన్నవి వెంటనే పరి ష్కరించి మిగతా వాటిని సంబంధిత అధికారులకు పంపుతూ అర్హులైన ప్రతి గిరిజన కు టుంబాలకు ప్రభుత్వం ద్వారా ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అందే విధంగా సంబంధిత యూనిట్ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీ సుకోవాలని ఆయన ఆదేశించారు.

ఈ గిరిజన దర్బార్ లో ఎక్కువ శాతం దరఖాస్తులు పోడు భూముల సమస్యలు, పోడు పట్టాలలో పేర్లు మార్పు కొరకు, నూతనంగా పోడు పట్టాలు ఇప్పించుట కొరకు, రైతుబంధు రుణాలు ఇప్పించుట కొరకు, వ్యక్తిగ త సమస్యలు,ఎం ఎస్ ఎం ఈ పథకము ద్వారా సబ్సిడీ రుణాలు ఇప్పించుట కొరకు, కొత్తగా ఏర్పాటు చేసే మత్స్యకార సొసైటీల అనుమతి కొరకు, సౌర గిరి జల విద్యుత్ ద్వారా వ్యవసాయానికి సంబంధించి కరెం టు, బోరు, మోటారు ఇప్పించుట కొరకు, గిరిజన గ్రామాలు మరియు పంట పొలాలలో త్రీఫేస్ విద్యుత్ సౌకర్యం కల్పించుట కొరకు, మరియు జీవనోపాధి పెంపొందించుకోవడానికి వ్యక్తిగత రుణాలు ఇప్పించుట కొరకు, ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో ఉపా ధి పొందుటకు శిక్షణలు ఇప్పించుట కొరకు, దీర్ఘకాలిక రోగాలకు వైద్యం చేయించుకోవడానికి ఆర్థిక సహాయం ఇప్పించుట కొరకు, మరియు ఆశ్రమ పాఠశాలలో పనిచేయుచు న్న కంప్యూటర్ ఆపరేటర్ల పెండింగ్ వేతనం ఇప్పించుట కొరకు, కళ్యాణ లక్ష్మి, రైతు బం ధు, ఒంటరి మహిళలకు ఆర్థిక ప్రోత్సాహకాలు ఇప్పించుట కొరకు, కిరాణా షాపులు, ఫ్యాన్సీ స్టోర్ లు, పెట్టుకోవడానికి బ్యాంకు ద్వారా రుణాలు ఇప్పించుట కొరకు, గిరిజన గ్రామాలలో మంచినీటి సౌకర్యం కల్పించుట కొరకు, పై చదువులు చదవడానికి ఆర్థిక స హాయం అందించుట కొరకు, గిరిజనులు అర్జీలు పెట్టుకున్నారని ఆయన అన్నారు.

గిరిజన దర్బార్ లో వచ్చిన దరఖాస్తులను ఆన్లై న్లో ద్వారా ప్రత్యేక రిజిస్టర్లో నమోదు చేసి, అ ర్హులైన ప్రతి గిరిజన కుటుంబాలకు విడతల వారీగా ప్రభుత్వం ద్వారా ప్రవేశపెట్టే సంక్షే మ పథకాలు అందించడానికి చర్యలు చేపడుతున్నట్లు ఆయన అన్నారు.ఈ కార్యక్ర మంలో ఏపీఓ జనరల్ డేవిడ్ రాజ్, డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధికారి అశోక్, ఈ ఈ ట్రై బల్ వెల్ఫేర్ మధుకర్, ఆర్సిఓ గురుకులం అ రుణ కుమారి, ఏవో రాంబాబు, ఏడీఎంహె చ్వో సైదులు, డిప్యూటీ డి ఎం హెచ్ ఓ చైత న్య, ఎస్.ఓ, భాస్కరన్ ,ఏపీఓ పవర్ వేణు, డి టి ఆర్ ఓ ఎఫ్ లక్ష్మీనారాయణ, కొండరెడ్ల విభాగం అధికారి భూక్య గన్య,మిషన్ భగీరథ ఏఈఈ నారాయణ రావు, మేనేజర్ ఆదినారాయణ, వివిధ విభాగాలకు ఐసిడిఎస్ సూపర్వైజర్ చంద్రకళ, భార్గవి, మోహ న్, తదితరులు పాల్గొన్నారు.