calender_icon.png 11 January, 2026 | 2:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాతి సమైక్యతను పెంపొందించే లక్ష్యం

10-01-2026 01:17:08 AM

అలంపూర్, జనవరి 9: విద్యార్థి దశలోనే విద్యార్థులకు  జాతీయ సమైక్యతను పెంపొందించే లక్ష్యమే ఫుడ్ ఫెస్టివల్ యొక్కఆవశ్యకత అని హెచ్‌ఎం మాధవి అన్నారు. శుక్రవారం అలంపూర్ పరిధిలోని క్యాతూరు గ్రామంలో ఉన్న పీఎంఎస్ హెచ్‌ఆర్‌ఐ, జడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో విద్యార్థులకు ఫుడ్ ఫెస్టివల్ పై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఇట్టి కార్యక్రమంలో అన్ని తరగతులకు చెందిన విద్యార్థిని విద్యార్థులు పాల్గొని ,హర్యానా రాష్ట్రానికి చెందిన సాంప్రదాయ, సంస్కృతి, ఆహార పదార్థాలు, వేషధారణ, భాష పరిచయం మరియు జీవనశైలి గురించి ఆకర్షణీయంగా విద్యార్థులు చక్కగా ప్రదర్శించినట్లు ఆమె తెలిపారు.

ఫుడ్ ఫెస్టివల్ ద్వారా విద్యార్థుల్లో జాతీయ ఐక్యత, సాంస్కృతిక వైవిధ్యం పై అవగాహన పెరిగిందన్నారు.ఈ కార్యక్రమానికి ఉపాధ్యాయ బృందం సంపూర్ణ సహకారం అందించడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ తిమ్మయ్య, మధు, వసంత్, రవి, కరుణాకర్ మద్దిలేటి, రాజు, చందు బాబు కళ్యాణ్ దేశమని ప్రియదర్శిని తదితరులు పాల్గొన్నారు.