10-01-2026 01:16:02 AM
ఒకేషనల్ కళాశాలలో అదనపు తరగతి గదులను ప్రారంభించిన ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్‌నగర్, జనవరి 9(విజయక్రాంతి): చదువు నిరుపేదరికాన్ని దూరం చేసి ప్రతి వ్యక్తి తలరాతను మార్చే శక్తి ఉంటుందని తెలిసే అవసరమైన సౌకర్యాలను అందుబాటులో ఉంచుతున్నామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో రూ 310 లక్షల వ్యయంతో టీజీబీఐఈ నిధులతో నూతనంగా నిర్మించిన ఒకేషనల్ జూనియర్ కళాశాలను ఎమ్మెల్యే *lయెన్నం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నన్ను ఎమ్మెల్యేగా చేసింది భగవంతుడే& మీ కోసమే ఈ బాధ్యత ఇచ్చారన్నారు.
ఈ కళాశాల విద్యార్థులకు గొప్ప అవకాశమని పేర్కొన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో సాధారణ విద్యతో పాటు వృత్తి నైపుణ్యాలు అత్యంత అవసరమని, అందుకే ప్రభుత్వం ఒకేషనల్ విద్యపై ప్రత్యేక దృష్టి సారిస్తోందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, వివిధ కళాశాలల ప్రిన్సిపాళ్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
అందరూ బాగుండాలన్నదే నా తాపత్రయం
మహబూబ్ నగర్, జనవరి 9(విజయక్రాంతి): అందరూ బాగుండాలన్నదే నా తాపత్రయమని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆసుపత్రిలో తల్లి, బిడ్డలకు అవసరం మేరకు సొంత నిధులతో సమకూర్చిన యెన్నం హెల్త్ కిట్లను ఎమ్మెల్యే ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అందచేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు అందుతున్న వైద్య సేవల గురించి వైద్యులను, సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు.
ఆసుపత్రిలోని ప్రతి వార్డును క్షుణ్ణంగా పరిశీలించి, రోగులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రంగ అజ్మీర, హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు బెజ్జుగం రాఘవేంధర్, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, మహబూబ్ నగర్ ఫస్ట్ పర్యవేక్షకులు గుండా మనోహర్, హెచ్ ఓ డి డాక్టర్ మాధవి, స్త్రీ వైద్యనిపుణులు డాక్టర్ ఆశాజ్యోతి తదితరులు పాల్గొన్నారు.