17 March, 2026 | 3:05 AM

ఐను మొబైల్ కిడ్నీ హెల్త్ ప్రోగ్రాం

17-03-2026 12:36 AM

10, 368 మందికి పైగా ఉచిత కిడ్నీ ఆరోగ్య పరీక్షలు 

హైదరాబాద్, మార్చి 16 (విజయక్రాంతి) : ఆసియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (ఏఐఎన్‌యూ) గత సంవత్సరం వరల్డ్ కిడ్నీ డే-2025 సందర్భంగా ప్రారంభించిన మొబైల్ కిడ్నీ స్క్రీనింగ్ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా మంచి స్పందన పొందుతోంది. ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు 10,368 మందికి పైగా ఉచిత కిడ్నీ ఆరో గ్య పరీక్షలు నిర్వహించారు. పరీక్షలకు హాజరైన వారిలో సగటు వయస్సు 39.06 సంవత్సరాలు కాగా, అందులో 66% పురుషులు, 34% మహిళలున్నారు.

ముఖ్యంగా 21 నుం చి 40ఏళ్ల మధ్య వయస్సు గల వారు 58. 9% ఉండటం గమనార్హం. పరీక్షల్లో  అత్యం త ముఖ్యమైన అంశంగా 24.01% మందికి రక్తపోటు (హైపర్టెన్షన్) ఉన్నట్లు గుర్తించారు. ప్రతి నలుగురి లో ఒకరికి రక్తపోటు ఉన్నట్లు తేలింది. స్క్రీ నింగ్ ద్వారా కొంతమంది ఇప్పటికే క్రానిక్ కిడ్నీ డిసీజ్ ముందడుగు దశల్లో ఉన్నట్లు గుర్తించారు. స్టేజ్-3-2.46%, స్టేజ్-4: 0.33 %, స్టేజ్-5: 0.07గా గుర్తించారు.

ఇటీవలి అధ్యయనాల ప్రకారం తెలంగాణ లో కిడ్నీ వ్యాధుల ప్రబలత గత దశాబ్దంలో 34 శా తం నుంచి దాదాపు 7.4 శా తానికి పెరిగినట్లు అంచనా. కిడ్నీ వ్యాధులను చాలా వరకు నివారించవచ్చని నిపు ణులు సూచిస్తున్నా రు. రక్తపోటును క్రమం తప్పకుండా పరీక్షించుకోవడం, ఆహారంలో ఉప్పు తగ్గించడం, ఆరోగ్యకరమైన బరువు నిర్వహిం చడం, నిత్యం వ్యాయామం చేయడం, పొగా కు వినియోగాన్ని నివారించడం మంచింది.