రహదారి నిర్మాణం చేపట్టాలని వినతి
బూర్గంపాడు,(విజయక్రాంతి): బూర్గంపాడు మండల పరిధిలోని సారపాక పంచాయతీలో రామభద్ర ఐటీఐ కళాశాల నుండి గాంధీనగర్ కాలనీ వైపు వెళ్లే 30 అడుగుల రహదారి గుంతలమయంగా మారిందని, సమస్యను పరిష్కరించి నూతన రహదారి నిర్మాణం చేపట్టాలని బీజేపీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కౌన్సిల్ మెంబర్ చుక్కపల్లి బాలాజీ సోమవారం కలెక్టరేట్‌లో అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ గుంతల రహదారి వల్ల వాహనదారులు, విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వర్షాకాలంలో పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని, ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆ వినతిలో పేర్కొన్నారు. ఈ సమస్యపై సంబంధిత అధికారుల దృష్టికి పలుమార్లు తీసుకువెళ్లినా నేటి వరకు పరిష్కారం లభించలేదని, తక్షణమే రహదారిని పరిశీలించి నూతన రహదారి నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.






