13 July, 2026 | 11:51 PM

Breaking News

కొండపాకలోనే యంగ్ ఇండియా పాఠశాల ఏర్పాటు చేయాలి   •   గిరిజన విద్యార్థులను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దడమే ఐటీడీఏ లక్ష్యం   •   రాష్ట్ర స్థాయి క్రీడాపోటీల్లో జిల్లా పోలీసుల ప్రతిభ   •   పుల్లూరు బండలో రామయ్య తలంబ్రాల పంపిణి   •   చేనేత రంగానికి ప్రత్యేక నిధులు కేటాయించాలి   •   బాలకార్మికుడికి విముక్తి… బడిలో చేర్పించిన సర్పంచ్   •   కార్మికులకు ప్రత్యేక వైద్య శిబిరం   •   తప్పకుండా ఆల్బెండాజోల్ మాత్రలు తీసుకోవాలి   •   33/11 కెవి అచ్చంపేట సబ్ స్టేషన్ లో ఫైవ్ ఎంవిఏ ట్రాన్స్ఫార్మర్ ప్రారంభించిన ఎస్ఇ శాలియా నాయక్   •   నిరుపేద విద్యార్థినికి రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేత   •  

సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్

13-07-2026 09:12 PM

బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలో కొనసాగుతున్న ఎస్‌ఐఆర్ పత్రాల పంపిణీ, సేకరణ ప్రక్రియను బాన్సువాడ మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బాన్సువాడ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్, మాజీ డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి సూచనల మేరకు పట్టణంలోని వివిధ బూత్‌లలో ఎస్‌ఐఆర్ పత్రాల పంపిణీ, నింపిన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను పరిశీలించినట్లు తెలిపారు.

బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలోని అర్హులైన ఓటర్లు తమ ఎస్‌ఐఆర్ పత్రాలను పూర్తిగా నింపి, సంబంధిత బూత్‌లలో విధులు నిర్వహిస్తున్న బూత్ లెవెల్ ఆఫీసర్ల కు సకాలంలో అందజేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన గడువులోగా ప్రతి ఓటరు తమ వివరాలను సమర్పించి, ఈ ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు. ఆయన వెంట రెండోవ వార్డు కౌన్సిలర్ జంగం రాజశేఖర్ తదితరులున్నారు.