03-10-2025 01:40:34 PM
సుదర్శన చక్రను తయారు చేస్తున్నాం
న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్ తో పాకిస్థాన్(Pakistan) ను మోకాళ్లపై నిలబెట్టామని వైమానిక దళ అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్(Air Chief Marshal Amar Preet Singh) వెల్లడించారు. ఆపరేషన్ సిందూర్ తో ఐఏఎఫ్(Indian Air Force) సత్తా ఎలాంటిదో ప్రపంచం చూసిందన్నారు. శత్రువుల స్థావరాలను గురిచూసి కచ్చితంగా కొట్టామని సూచించారు. ఆపరేషన్ సిందూర్ లో కేంద్ర ప్రభుత్వం తమకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చిందని తెలిపారు. ఆపరేషన్ సిందూర్ తో భారత్ సత్తా ఏంటో ప్రపంచం చూసిందన్నారు.
నిర్దిష్ట లక్ష్యంతో ఆపరేషన్ సింధూర్ ప్రారంభించి త్వరగా పూర్తి చేశామని వెల్లడించారు. సంక్షోభం ఎలా ఎదుర్కోవచ్చో ప్రపంచం భారత్ ను చూసి నేర్చుకోవచ్చని తెలిపారు. పాకిస్థాన్ ఎఫ్-16 యుద్ధ విమానాలు ధ్వంసం చేశామని చెప్పారు. త్రివిధ దళాల సమన్వయంతో ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) చేపట్టామన్నారు. భవిష్యత్ సవాళ్లు అధిగమించేందుకు రక్షణ రంగలో స్వావలంబన అవసరమని వివరించారు. గగనతల రక్షణ వ్యవస్థ 'సుదర్శన చక్ర'ను తయారు చేస్తున్నామని వెల్లడించారు. సుదర్శన చక్ర(Sudarshana Chakra) తయారీకి త్రివిధ దళాలు పని ప్రారంభించాయని తెలిపారు. మరిన్ని ఎస్-400 ల కోసం ప్రణాళికలు రచిస్తున్నామని వైమానిక దళ అధిపతి పేర్కొన్నారు.