calender_icon.png 3 October, 2025 | 4:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మద్రాస్ హైకోర్టులో టీవీకే పార్టీకి చుక్కెదురు

03-10-2025 02:03:52 PM

చెన్నై:  మద్రాస్ హైకోర్టులో టీవీకే పార్టీకి చుక్కెదురైంది. తొక్కిసలాట ఘటన విచారణను సీబీఐ దర్యాప్తుకు ఆదేశించాలని టీవీకే పిటిషన్ వేసింది. సెప్టెంబర్ 27న తమిళనాడులోని కరూర్‌లో(Karur stampede) టీవీకే అధినేత, నటుడు విజయ్ నిర్వహించిన బహిరంగ ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మృతి చెందడంతో ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తు కోసం దాఖలైన అభ్యర్థనను మద్రాస్ హైకోర్టు శుక్రవారం తిరస్కరించింది. కేసు దర్యాప్తు ప్రారంభ దశలోనే ఉన్నందున ప్రస్తుతానికి ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని తెలిపింది. ప్రజల ప్రాణాల రక్షణకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని కోర్టు తెలిపింది. కోర్టులను రాజకీయ వేదికలుగా మార్చవద్దని న్యాయమూర్తి హెచ్చరించారు. ప్రజల ప్రాణాలు కాపాడటమే ప్రభుత్వ ప్రథమ లక్ష్యమన్నారు. నీళ్లు, ఆహారం సదుపాయం లేకుండా సభ ఎలా నిర్వహించారని హైకోర్టు ప్రశ్నించింది. రోడ్డు సమావేశం ఏర్పాటుకు ఎందుకు అనుమతించారని పోలీసులకు మొట్టికాలేసింది. బాధితులకు పరిహారం పెంపుపై రెండు వారాల్లో సమాధానం ఇవ్వాలని మద్రాస్ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.

విజయ్ బహిరంగ ర్యాలీకి పెద్ద ఎత్తున జనం తరలివచ్చి గందరగోళం సృష్టించారు. దీంతో అక్కడున్న చాలా మంది స్పృహ కోల్పోయి, చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ఆ స్థలంలో జనసమూహం ఎక్కువగా ఉండటం వల్లే ఈ విషాదం చోటు చేసుకుందని వర్గాలు తెలిపాయి. ఇంతలో, తమిళగ వెట్రి కజగం (టీవీకే) చీఫ్, నటుడు విజయ్ రాబోయే రెండు వారాల పాటు అన్ని రాజకీయ ర్యాలీలను నిలిపివేశారు. దీనితో ఆయన రాష్ట్రవ్యాప్త ఎన్నికల ప్రచారానికి విరామం ఇచ్చారు. మృతుల కుటుంబాలకు విజయ్ పార్టీ రూ.20 లక్షల పరిహారం ప్రకటించింది. టీవీకే కాకుండా, కాంగ్రెస్ పార్టీ కూడా బాధిత కుటుంబాలకు మొత్తం రూ.1.25 కోట్లు విరాళంగా ఇచ్చినట్లు గతంలో ప్రకటించింది. అంతకుముందు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా వారికి రూ.2 లక్షల ఎక్స్-గ్రేషియాను ప్రకటించారు, గాయపడిన వారికి రూ.50,000 అందజేయనున్నారు. ఈ సంఘటనపై విచారం వ్యక్తం చేస్తూ టీవీకే సోషల్ మీడియాలో తమ ర్యాలీలను తాత్కాలికంగా నిలిపివేయడం గురించి పోస్ట్ చేసింది.