ఎయిరిండియా విమానం.. 22 గంటలు ఆలస్యం
03-06-2024 12:12 AM
న్యూఢిల్లీ, జూన్ 2: ఎయిరిండియా మరోసారి ప్రయాణికులను ముప్పు తిప్పలు పెట్టింది. ఢిల్లీ నుంచి వాంకోవర్ వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం ఏకంగా 22 గంటల పాటు ఆలస్యంగా నడవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. శనివారం ఉదయం 5.30 గంటలకు బయల్దేరాల్సిన ఏఐ 185 విమానం సాంకేతిక సమస్యతో ఆదివారం తెల్లవారుజామున 3.15 గంటలకు కానీ కదలలేదు. గత వారంలోనే ఎయిరిండియా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడం మూడోసారి కావడం గమనార్హం. అయితే ఇప్పటివరకు ఎయిరిండియా యాజమాన్యం దీనిపై స్పదించలేదు. ఇటీవలే శాన్‌ఫ్రాన్సిస్కో వెళ్లాల్సిన విమానంలో ప్రయాణికులు బోర్డింగ్ అయిన తర్వాత సాంకేతిక సమస్య తలెత్తిందని నిలిపేశారు. కనీసం వారిని విమానాశ్రయంలోకి కూడా అనుమతించలేదు. చివరికి అక్కడ గాలి సరిగ్గా అందక స్పృహ కోల్పోయారు.






