25 July, 2026 | 8:59 AM

బిజీ బిజీగా ప్రధాని మోదీ

03-06-2024 12:16 AM

45 గంటల ధ్యానం ముగించుకుని ఢిల్లీకి పయనం

ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో నూతనోత్సాహం

తొలి 100 రోజుల ఎజెండాపై దృష్టి

న్యూఢిల్లీ, జూన్ 2: తమిళనాడులోని కన్యాకుమారిలో 45 గంటల ధ్యానం ముగించుకున్న ప్రధాని మోదీ శనివారం రాత్రి దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్నారు. ఆదివారం ఏకంగా ఏడు సమీక్షా సమావేశాలు నిర్వహించి నూతనోత్సాహంతో కనిపించారు. ఈశాన్య రాష్ట్రాలపై రెమాల్ తుఫాన్ ప్రభావం, పెరిగిన ఉష్ణోగ్రతలు, ఉత్తర భారతంలో వడగాడ్పులు, మరణాలపై ప్రత్యేకంగా చర్చించినట్లు సమాచారం. ఈ నెల 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నిర్వహించనున్న కార్యక్ర మాలపై చర్చించినట్లు తెలిసింది. మరోవైపు లోక్‌సభ ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్ కూడా విడుదలవడంతో మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేశాక ‘తొలి 100 రోజుల ఎజెండా’పై ప్రత్యేక దృష్టి సారించి కీలక నేతలు, నిపుణులతో సుదీర్ఘమైన చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ప్రాధాన్య క్రమంలో ప్రణాళికలను అమలు చేయనున్నట్లు సమాచారం.